‘రాకా’ హిస్టరీ క్రియేట్ చేస్తది.. రైటర్ నాగేంద్ర షాకింగ్ కామెంట్స్!
ABN , Publish Date - May 31 , 2026 | 02:51 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాకా’. ఈ సినిమా గురించి రైటర్ నాగేంద్ర సంచలన విషయాలు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాకా’ (Raaka). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రముఖ రైటర్ నాగేంద్ర కాశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ చిత్రం ఒక సంచలనం సృష్టించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకుంటూ.. ‘రాకా’ షూటింగ్ సెట్స్‌లో జరుగుతున్న హంగామా చూసి తాను పూర్తిగా అవాక్కయ్యానని పేర్కొన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని రీతిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని, దర్శకుడు అట్లీ సరికొత్త రికార్డులను లిఖించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సెట్స్‌లోని ఎనర్జీ, ఇంటెన్సిటీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోందని, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోతుందని నాగేంద్ర కాశీ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం కథాంశం పరంగా పూర్తి సరికొత్త జోనర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత రగ్డ్ వారియర్ లుక్‌లో కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. కథలో వచ్చే ఊహించని భారీ ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండటంతో, ఈ కాంబినేషన్ లైనప్ పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని టాక్. దర్శకుడు అట్లీకి ఉన్న మాస్ విజన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ క్రేజ్, దీపికా పదుకొణే గ్లామర్, అలాగే సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ నాల్గింటి కలయికతో రూపొందుతున్న ‘రాకా’ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా రాకెట్ స్పీడ్‌తో శరవేగంగా జరుపుకుంటోంది. ఎలాగైనా సరే ఈ విజువల్ వండర్‌ను 2027లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో రాబోతున్న ‘రాకా’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ చిత్రం థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. ఇక బన్నీ-అట్లీ కాంబో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మూవీ విడుదల వరకు ఎదురుచూడక తప్పదు.
ఇవి కూడా చదవండి:
రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!
చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!