రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!

ABN , Publish Date - May 30 , 2026 | 09:01 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెట్స్‌లోనే కాదు, బయట కూడా ఎంత అల్లరిగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన తోటి నటీనటులతో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

Rakul Preet Singh and Akshay Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సెట్స్‌లోనే కాదు, బయట కూడా ఎంత అల్లరిగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన తోటి నటీనటులతో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్‌లో అందరికీ పరిచయమున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ (Rakul Preet Singh)ను ఈ బాలీవుడ్ హీరో ఘోరంగా బురిడీ కొట్టించారు. వర్షం పడి రోడ్డుపై నీరు నిలిచిన ఒక చోట రకుల్‌ను ఇరకాటంలో పడేసి.. ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందంటే.. రోడ్డు మధ్యలో నిలిచిన వర్షపు నీటిని దాటడానికి రకుల్ ఇబ్బంది పడుతుంటే, అక్షయ్ కుమార్ ఒక జెంటిల్‌మెన్‌లా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. పక్కనే ఉన్న ఒక ఇటుకను తెచ్చి ఆ నీటిలో ఒక్కొక్కటిగా వేస్తూ వచ్చారు. దానిపై అడుగు వేస్తూ రకుల్ ముందుకు వెళ్తుండగా, వెనక నుంచి మరో ఇటుకను తీసి ముందు వేస్తూ నమ్మకం కలిగించారు. తీరా రకుల్ ఆ ఇటుకలపై నిలబడి మధ్యలోకి వెళ్లాక, అక్షయ్ అసలు రంగు బయటపెట్టారు. ఆమె నిలబడిన ఇటుక కాకుండా, ముందున్న ఇటుకను చేత్తో పట్టుకుని రకుల్‌కు చూపిస్తూ ఆటపట్టించారు.


అక్కడున్న బురద నీటి మధ్యలో రకుల్‌ని ఒక రాయిపై ఉంచేసి.. అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రకుల్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అక్షయ్ కుమార్ నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోగా.. రకుల్ ప్రీత్ సింగ్ కోపంతో, నవ్వుతో ఆయనను వెంటాడుతూ పరిగెత్తింది. షూటింగ్ గ్యాప్‌లో జరిగిన ఈ ఫన్నీ ప్రాంక్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలను అక్షయ్ కుమార్.. తన తోటి నటీనటులతో ఇలా ప్రాంక్ చేస్తూ అభిమానులను అలరిస్తారనే విషయం తెలియంది కాదు.

ఇవి కూడా చదవండి:

చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

Updated Date - May 30 , 2026 | 09:01 PM