Agadha Teaser Review: ఇక ఎవ్వరి ఆటలు సాగవ్.. ‘అగధ’ వచ్చేసింది!
ABN, Publish Date - May 07 , 2026 | 07:24 PM
ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తోన్న చిత్రం ‘అగధ’. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
‘దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం’ వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన దిగ్గజ నిర్మాత ఎం.ఎస్.రాజు (MS Raju), తనలోని దర్శకుడిని కొత్తగా ఆవిష్కరించుకుంటూ తీస్తున్న సినిమా ‘అగధ’. నిర్మాతగానే కాదు, దర్శకుడిగానూ తన అభిరుచిని చాటుతూ వస్తోన్న ఈ స్టార్ నిర్మాత.. ఇప్పుడు మరో వైవిధ్యభరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తోన్న చిత్రం ‘అగధ’ (Agadha). పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తోంది.
టీజర్‌ని గమనిస్తే (Agadha Teaser Review).. ‘ప్రకృతులు దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో అవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగున్నాయి’ అంటూ కామాక్షి భాస్కర్ల వాయిస్‌తో మొదలైన ఈ టీజర్‌లో.. ఫస్ట్ షాట్ నుంచే భయాన్ని పరిచయం చేశారు. ఆమె చెప్పే ఈ డైలాగ్‌లోనే సినిమాలోని విషయం ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది తెలిసిపోతోంది. రహస్యంతో నిండిన అతీత శక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది అర్థమవుతోంది. ఆ రహస్యం ఏదో కాదు.. అదే ‘అగధ’. ‘ఈ అతీత శక్తులలో కొన్ని రక్షించేవి అయితే.. ఇంకొన్ని వేధించేవి’ అనే డైలాగ్ అనంతరం వచ్చే ఒక్కో షాట్.. భయపెడుతూనే ఏదో కొత్తగా చెప్పబోతున్నారనే ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
అసలు ‘అగధ’ ఎవరు? అనే క్యూరియాసిటీని కలిగించేలా ఈ టీజర్‌ని కట్ చేసిన తీరు.. సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఓ కథని చెప్పడానికి ఈ మధ్యకాలంలో భారీ హంగులతో హడావుడి చేస్తున్నారు. కానీ, ఇందులో ప్రతి షాట్.. చాలా నేచురల్‌గా ఉండటం చూస్తుంటే.. అది ఎం.ఎస్. రాజు అనుభవమని చెప్పకతప్పదు. కామాక్షి భాస్కర్ల కనిపించిన తీరు.. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా పాత్రలు కూడా కథలో కీలకమని తెలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక కనిపించిన ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తోందంటే, ఆమె పాత్రని దర్శకుడు ఎలా మలిచి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ‘అగధ వచ్చేసిందమ్మా.. అగధ ముందు ఎవ్వరి ఆటలు సాగవ్’ అని జోవిక చెబుతుంటే.. ఏదో లోతైన రహస్యం ఇందులో దాగి ఉందనే విషయం తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఎం.ఎస్.రాజు ‘డర్టీ హరి’తో రూట్ మార్చినట్లు అనిపించినా, ఈ ‘అగధ’తో మళ్ళీ తన మార్క్ విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వబోతుందనేది.. ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. మొత్తంగా అయితే సినిమాపై భారీగా అంచనాలను ఏర్పడేలా చేయడంలో టీజర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి:
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?