MS Raju: ‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇది జస్ట్ టీజర్ మాత్రమే!

ABN , Publish Date - May 07 , 2026 | 05:01 PM

ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తోన్న చిత్రం ‘అగధ’. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోంది.

Agadha Teaser Launch Event

MS Raju: ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తోన్న చిత్రం ‘అగధ’. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోంది. కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్ర టీజర్‌ (Agadha Teaser)ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..


ఎం.ఎస్. రాజు (M.S. Raju) మాట్లాడుతూ.. టీజర్‌లో చూసింది చాలా తక్కువ.. విజువల్ వండర్ అనిపించే ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక ఫిల్మ్ మేకర్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షికి, డా. రాజు, సుబ్బరాజు, మరో మిత్రుడికి థాంక్స్ చెబుతున్నాను. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఇందులో టెక్నీషియన్ల, ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో ఈ టీజర్ చూసిన తర్వాత అందరికీ అర్థమై ఉంటుంది. నిజంగా ఒక విజువల్ వండర్‌లా ఈ సినిమా ఉంటుంది. మహాదేవిగా కామాక్షి డెడికేషన్, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్. ఈ ప్రాజెక్టులో ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ ఎంతో సపోర్ట్ చేశారు. శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడనే నమ్మకం ఉంది. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల గారి మనవరాలు, వనిత కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నాను. సాంకేతిక నిపుణులందరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు. ‘అగధ’ పెద్ద హిట్ అవ్వాలని, అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నానని తెలిపారు.


నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ.. మా అన్న ఎం.ఎస్. రాజు వల్లే సినీ నిర్మాణంలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ఆయనకు, సుబ్బరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మూవీ టీజర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి హిట్ చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, వనితా విజయ్ కుమార్ వంటి వారంతా మాట్లాడుతూ.. ఎం.ఎస్. రాజు ‘దేవి’ సినిమాను మించేలా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Updated Date - May 07 , 2026 | 05:01 PM