Adivi Sesh: ఆ లాయర్ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:47 PM

అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. శానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డెకాయిట్’. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

Adivi Sesh

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా.. శానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ (Dacoit Thanks Meet) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్ చెప్పిన ఓ విషయం బాగా వైరల్ అవుతోంది.


‘‘ఈ ‘డెకాయిట్’ సినిమాకు సంబంధించి బెంగళూరు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు కొంతమంది నన్ను కలిశారు. ఆ సమయంలోనే తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి నాతో చెప్పారు. తనను ఎవరో 150 మంది కలిసి కొట్టారట. చాలాకాలం హాస్పిటల్‌లోనే ఉన్నాడు. హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటే భయమేసిందని, తనకు ధైర్యం ఇచ్చింది ‘మేజర్’ సినిమా అని చెప్పాడు. ‘డెకాయిట్’ రిలీజ్ అవుతుందని తెలిసి, హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మొదటిగా ఈ సినిమానే చూశానని చెప్పాడు. సినిమా చాలా నచ్చిందని, నన్ను కలవడానికే వచ్చానని చెప్పాడు. అతనలా ఎమోషనల్‌గా మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది. మనమంతా సినిమా, బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం. ఆయన నాకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో మరోసాని నాకు గుర్తు చేశాడు. అలాగే ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ నిర్వహిస్తున్న వారు ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో పెట్టుకోమని నాకు ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంత ప్రేమను ప్రేక్షకులు, మీడియా నుంచి పొందుతున్నప్పుడు.. ఇదే క్రెడిబిలిటీ అని అనిపిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తిని నాకు ఈ సినిమా ఇచ్చింది. ఆరోజు బెంగళూరులో ఆ లాయర్‌ని కలిసినప్పుడు వచ్చిన అనుభూతి నాకు ఒక షీల్డ్‌లా అనిపించింది.


ఇక ఈ సినిమా కోసం 45 డిగ్రీల వేడి ఉన్న పర్వతాలపై షూటింగ్ చేశాం. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో ప్రమాదాలను కూడా ఫేస్ చేశాం. ప్రేక్షకులకు రియల్ అనుభూతి ఇవ్వాలని టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. టెక్నికల్ బ్రిలియన్స్‌తో పాటు భావోద్వేగాలు, ప్రమాదకర పరిస్థితులు అన్నీ అందులో మిళితమై ఉన్నాయి. అలాగే రెండు భాషల్లో ఈ సినిమా తీశాం. ఈ సినిమాపై రామ్ చరణ్ చేసిన ట్వీట్ చదువుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నాని కూడా సినిమా గురించి మాట్లాడారు. సినిమా రూ. 50 కోట్లు సాధించిన సందర్భంగా మీడియాకు ధన్యవాదాలు.. ఇవన్నీ మా ప్రయత్నాన్ని మీరందరూ గౌరవించిన భావనని ఇస్తున్నాయి’’ అని హీరో అడివి శేష్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Updated Date - Apr 18 , 2026 | 06:47 PM

Decoit Movie: షూటింగ్ లో ప్రమాదం..అడివి శేష్, మృణాల్ కు తీవ్ర గాయాలు

Adivi Sesh's Dacoit: ఫైనల్‌గా శేష్‌కి తోడు దొరికేసింది.. ఎవరు ఆమె

Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

Adivi Sesh: 'గూఢచారి 2' లో కథానాయకురాలిని మార్చిన అడివి శేష్

Adivi Sesh: ఇద్దరు అవుట్‌.. హీరోయిన్లు కావలెను..