Decoit Movie: షూటింగ్ లో ప్రమాదం..అడివి శేష్, మృణాల్ కు తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:33 PM

యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న చిత్రం డెకాయిట్ (Decoit).

Decoit Movie

Decoit Movie: యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న చిత్రం డెకాయిట్ (Decoit). షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో ప్రమాదం జరిగిందని సమాచారం.


యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కిందపడినట్లు తెలుస్తోంది. చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే షూటింగ్ ను నిలిపివేయకుండా.. గాయాలతోనైనా చేస్తామని చెప్పి ఇద్దరూ సీన్ ను ఫినిష్ చేసినట్లు సమాచారం. ఆ తరువాత వారిని హాస్పిటల్ కు తరలించారని తెలుస్తోంది. మైనర్ ప్రమాదం కావడంతో చిత్ర బృందం కూడా ఊపిరి పీల్చుకుందట. ఈ విషయం తెలియడంతో మృణాల్, శేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Updated Date - Jul 23 , 2025 | 03:33 PM