నటి ప్రగతికి నరకం చూపించిన ఆ దర్శకుడెవరో?
ABN, Publish Date - Apr 26 , 2026 | 03:23 PM
నటి ప్రగతి, తన తాజా ఇంటర్వ్యూలో సినీ కెరీర్‌లో జరిగిన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఓ దర్శకుడు తనని పెట్టిన ఇబ్బంది మాత్రం అంతా ఇంతా కాదని, నరకం చూపించాడని తెలిపారు.
మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు నటి ప్రగతి (Actress Pragathi). సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజీని సొంతం చేసుకున్న ప్రగతి, ఆ తర్వాత తన చిరకాల కోరికను తీర్చుకునే క్రమంలో, కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఆమె దేశం కోసం ఎన్నో పతకాలు సాధించారు. 50 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చేయడమంటే మాములు విషయం కాదు. అందులోనూ ప్రగతి వంటి వారికి అసాధ్యమని అనుకుంటారు. కానీ, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి, గొప్ప పేరును గడించారు ప్రగతి. అలాంటి ప్రగతి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌లో జరిగిన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. దర్శకుడి పేరు అయితే చెప్పలేదు కానీ, ఓ దర్శకుడు తనని పెట్టిన ఇబ్బంది మాత్రం అంతా ఇంతా కాదని, నరకం చూపించాడని తెలిపారు.
దీంతో ప్రగతిని ఇబ్బంది పెట్టిన దర్శకుడు ఎవరా? అని అంతా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అతనితో పని చేసినన్ని రోజులు.. ఎప్పుడెప్పుడు సినిమా పూర్తవుతుందా? ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోదామా? అని ఎదురు చూశానని ప్రగతి తెలిపారు. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఆమెకో పీడకలగా మారిందని, మళ్లీ ఆ దర్శకుడితో పని చేసే అవకాశం వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ఫిక్స్ అయినట్లుగా అసలు విషయం బయటపెట్టేశారు. గతంలో ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి నటీమణులు భయపడేవారు. కానీ, ఇప్పుడదేం లేదు.. ఇలాంటి ఇంటర్వ్యూలలో సంకోచం లేకుండా ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ప్రగతి కూడా తను ఫేస్ చేసిన చేదు అనుభవాన్ని ఈ విధంగా రివీల్ చేశారు. అయితే ఆ దర్శకుడెవరనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఆ దర్శకుడిని కనిపెట్టేందుకు.. నటి ప్రగతి చేసిన సినిమాలన్నింటినీ నెటిజన్లు తోడుతున్నారు.
ఇక పవర్ లిఫ్టింగ్‌లో తన సత్తా ఏంటో చాటి చెప్పిన ప్రగతి.. నటిగానూ మంచి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకి నచ్చని పాత్ర చేయమంటే, ఎంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా చేయనని.. నచ్చిన పాత్ర అయితే రెమ్యూనరేషన్ గురించి కూడా ఆలోచించనని ప్రగతి ఈ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పేశారు. ప్రస్తుతం ఆమె ఓ మంచి పాత్ర కోసం చూస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రేక్షకులు కూడా మళ్లీ ఆమె ఓ మంచి పాత్రతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?
బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!