Aakasamlo Oka Tara: చిట్టి చిట్టి చీమ.. ఎంత వినసొంపుగా ఉందమ్మా
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:05 PM
మలయాళ స్టార్ హీరో, టాలీవుడ్ లవర్ బాయ్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), సాత్విక (Satvika) జంటగాటి నటిస్తున్న చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara).
మలయాళ స్టార్ హీరో, టాలీవుడ్ లవర్ బాయ్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), సాత్విక (Satvika) జంటగాటి నటిస్తున్న చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara). పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ మూవీని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవారం దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రంలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.
చిట్టి చిట్టి చీమ.. అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జీవితంలో పైకి ఎదగాలనుకునే ఒక అమ్మాయి ఆశలను నెరవేర్చడానికి హీరో ఎలా సపోర్ట్ చేశాడు. సిటీకి వచ్చి స్వయంకృషితో ఎలా బతికారు అనేది ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకొనే ఒక అమ్మాయి. సొంతూరు వదిలి సిటీకి వస్తుంది. ఎన్నో ఆశలు, కలలు ఉన్న ఆ అమ్మాయి పాత్ర గురించి శ్రీమణి లిరిక్స్ లో వివరించారు. ఇక ఆ లిరిక్స్ ని మరింత వినసొంపుగా వినేలా జీవీ ప్రకాష్ స్వరాలు సమకూర్చగా.. రమ్య బెహరా తన వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది.
ఇక న్యాచురల్ గా ఉన్న విజువల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఫ్రెష్ మ్యూజిక్ తో ఈ సాంగ్ చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది. జీవితంలో ఎదగాలనుకొనే ప్రతి అమ్మాయి మనసులోని భావాలను ఈ సాంగ్ లో చూపించారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్న దుల్కర్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.