Aakasamlo Oka Tara: దుల్కర్ సినిమాలో బిజిలీగా..
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:12 PM
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి మరో తారను పరిచయం చేశారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ సినిమాలో బిజిలీగా నటిస్తున్న రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కిటికీ పక్కన కూర్చుని కనిపిస్తున్న ఆమె సంప్రదాయ దుస్తుల్లో సింపుల్‌గా, అందంగా ఆకట్టుకున్నారు. ప్లజెంట్ ప్రెజెంటేషన్‌లో రుహానీ సహజమైన అందంతో మెరిసింది. బిజిలీ పాత్ర సినిమాలో ఎలాంటి మలుపులు తీసుకొస్తుందనే ఆసక్తిని ఈ ఫస్ట్ లుక్ పెంచుతోంది. "అనుకోని సమయంలో కథలోకి ప్రవేశించి, అప్పటివరకు సాగుతున్న ప్రయాణానికి కొత్త వెలుగును తీసుకొచ్చే పాత్ర ఇది' అని మేకర్స్ తెలిపారు.
ఇటీవల విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌కు మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.