Thimmarajupalli TV: నిర్మాత‌గా.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం తొలి సినిమా

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:45 PM

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న తొలి చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

Thimmarajupalli TV

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశ పడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సుమైర స్టూడియోస్ (Sumaira Studios) తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ (KA Productions) పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ (Thimmarajupalli TV). తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల (Tejeswar Reddy Velpucharla) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్ (Sai Tej Pulula), వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. తాజాగా శుక్ర‌వారం టీవీ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

tv.jpeg

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) న‌టించిన‌ ప‌లు సినిమాల‌కు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయి తేజ్ హీరోగా, ఆన్ లైన్ ఎడిటింగ్ చేసే మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుద‌ల చేసిన ఈ తిమ్మరాజుపల్లి టీవీ (Thimmarajupalli TV) సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ ప్రస్తుతం జరుగుతుండ‌గా ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Updated Date - Jul 10 , 2025 | 06:56 PM