Vijay Deverakonda: నేను కూడా ఇలాంటి బాధని అనుభవించా!
ABN, Publish Date - Apr 11 , 2026 | 07:29 PM
నిన్నకాక మొన్న పెళ్లి చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఏంటి బాధలు అని అనుకుంటున్నారేమో? ఆయన చెబుతున్న విషయం పెళ్లి గురించో, ఫ్యామిలీ గురించో కాదు. చాలా సీరియస్ విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు.
నిన్నకాక మొన్న పెళ్లి చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు ఏంటి బాధలు అని అనుకుంటున్నారేమో? ఆయన చెబుతున్న విషయం పెళ్లి గురించో, ఫ్యామిలీ గురించో కాదు.. కోలీవుడ్ హీరో విజయ్ (Kollywood Star Vijay) నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) పైరసీ ఘటనపై ఈ విధంగా అసహనం వ్యక్తం చేశారు. గతంలో తను కూడా ఇలాంటి బాధని అనుభవించానని సోషల్ మీడియా ద్వారా విజయ్ తెలిపారు. ‘జననాయగన్’ పైరసీ ఘటన తనకు ఆగ్రహం తెప్పిస్తోందని, కెరీర్ ప్రారంభంలో తన సినిమా కూడా ఇలాగే లీక్ అయ్యిందని, ఆ టైమ్‌లో ఎవరో తనను టార్గెట్ చేస్తున్నట్లు, ఆశను కోల్పోయినట్లు అనిపించిందని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘‘జననాయగన్ సినిమాను విడుదలకు ముందే లీక్ చేయడం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకర ఘటన ఎదుర్కొన్నా. ఆ టైమ్‌లో ఎవరో కావాలని చేశారని నాకు అనిపించింది. ఆశలన్నీ కోల్పోయాను. సినిమా అనేది హీరోగా నా ఒక్కరికే కాదు.. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, ఇలా అందరి కల. ‘జననాయగన్’ సినిమా లీక్ వెనక ఎవరున్నారు? అనేది వీలైనంత త్వరగా గుర్తించాలి. ఇతరుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పులు చేసేవారు ఎలా ఉంటారో ఈ ఘటనతో మరోసారి స్పష్టమవుతోంది. ‘జననాయగన్’ టీమ్‌కు నా మద్ధతు తెలియజేస్తున్నాను’’ అని విజయ్ దేవరకొండ ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఏడాది అంతా సాగు చేసిన పంట చేతికి వచ్చే టైమ్‌లో దొంగల పాలు అయితే ఎలాంటి బాధ ఉంటుందో.. ఇప్పుడు విజయ్ ‘జననాయగన్’ టీమ్ కూడా అలాంటి బాధనే అనుభవిస్తోంది. ఈ సినిమా టీమ్‌లో సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలుపుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు.. ఇలా సినీ ప్రముఖులందరూ ఈ లీక్‌పై సీరియస్ అవుతూ, చిత్రయూనిట్‌కు మద్దతు తెలుపుతున్నారు. ‘జననాయగన్’ నిర్మాణ సంస్థ కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా రియాక్టైంది. నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు ప్రధాన నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. ఎడిటింగ్ దశ నుంచే ఈ సినిమా లీక్ అయినట్లుగా సమాచారం.
ఇవి కూడా చదవండి:
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!
Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?
దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ
‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్
నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!