సూర్య ‘సీన్’ 3 డేస్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టినట్టే
ABN, Publish Date - Nov 09 , 2026 | 07:49 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్ (Jithu Madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ (Scene) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 145 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వీకెండ్ ముగిసినప్పటికీ, సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదు కావడంతో బాక్సాఫీస్ వద్ద సూర్య పవర్ ఏంటో మరోసారి రుజువైంది.
ఈ భారీ విజయంతో సూర్య వరుసగా మూడో విజయాన్ని అందుకుని అదిరిపోయే రేంజ్లో హ్యాట్రిక్ కొట్టేశారు. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’), ఆ వెంటనే వచ్చిన ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లు సాధించిన సూర్య.. ఇప్పుడు ‘సీన్’ చిత్రంతో హ్యాట్రిక్ మైలురాయిని పూర్తి చేసుకున్నారు. కథానాయికగా నజ్రియా నజీమ్ 12 ఏళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చి తన మార్క్ నటనతో మెప్పించగా, మలయాళ యువ నటుడు నస్లెన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో అలరించారు. సూర్య-జ్యోతికల 2డీ ఎంటర్టైన్మెంట్, జాగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా, సుశీన్ శ్యామ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
మరోవైపు ఈ సినిమాను వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా.. ‘‘సీన్ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది! ఎంతో కూల్, స్మార్ట్ అండ్ ఫన్ ఎంటర్టైనర్. ఇన్బరాజ్ పాత్రలో సూర్య ఫ్యాబులస్‌గా నటించారు. నజ్రియా, నస్లెన్ నటన ఫెంటాస్టిక్. దర్శకుడు జిత్తు మాధవన్ బ్రిలియంట్ రైటింగ్, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ అద్భుతం. అన్ని విభాగాల్లోనూ సినిమా ఎంతో ఇంప్రెసివ్‌గా ఉంది. డెఫినెట్‌గా అందరూ చూడాల్సిన చిత్రం..’’ అంటూ మహేష్ రివ్యూ ఇచ్చారు. సూపర్ స్టార్ ప్రశంసలు కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ‘సీన్’ మరింత ఊపందుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోందని అంతా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ధురంధర్ 2’ రికార్డులు బద్దలవుతున్నాయ్.. అంతా రామ మయం
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు? కారణమిదేనా..
‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల