Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

ABN , First Publish Date - 2023-02-24T18:30:50+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో శింబు (Simbu) ఒకరు. ఆయనకు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. రైటర్‌, సింగర్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో శింబు (Simbu) ఒకరు. ఆయనకు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. రైటర్‌, సింగర్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ హ్యాండ్సమ్ హీరో అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ఆయన నయనతార (Nayanthara), హన్సిక‌ (Hansika) లతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే.

శ్రీలంకకు చెందిన ఓ అమ్మాయిని శింబు వివాహమాడనున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఆమె మెడికల్ స్టూడెంట్ అని, శింబుకు వీరాభిమాని అని సమాచారం. ఆమె తండ్రి బడా వ్యాపారవేత్త అని వదంతులు షికార్లు కొడుతున్నాయి. శ్రీలంకలో పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శింబుకీ ఆమెతో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. పెళ్లిపై ఇరు కుటుంబాలు ఇప్పటికే చర్చించుకున్నాయని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి పనులు కూడా గుట్టుగా కొనసాగుతున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. వివాహనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమచారం. ఇక కెరీర్ విషయానికి వస్తే.. శింబు చివరగా ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ (Life of Muthu)లో నటించారు. ఈ చిత్రం ఆయన కరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-24T18:31:54+05:30 IST