నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:31 PM
టాలీవుడ్‌ను ప్రస్తుతం ఒకటే సమస్య పట్టి పీడిస్తోంది.. అదే ‘లీకుల బెడద’. ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసినా, సెట్స్‌లోకి ఫోన్లు అనుమతించబోమని కఠిన నిబంధనలు పెట్టినా సరే.. ఎక్కడి నుంచో ఒకచోట ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లోకి లీకైపోతూనే ఉన్నాయి.
టాలీవుడ్‌ను ప్రస్తుతం ఒకటే సమస్య పట్టి పీడిస్తోంది.. అదే ‘లీకుల బెడద’. ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసినా, సెట్స్‌లోకి ఫోన్లు అనుమతించబోమని కఠిన నిబంధనలు పెట్టినా సరే.. ఎక్కడి నుంచో ఒకచోట ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లోకి లీకైపోతూనే ఉన్నాయి. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) లాంటి అగ్ర దర్శకుల భారీ ప్రాజెక్టులకే లీకుల తిప్పలు తప్పట్లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, తాజాగా నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కొత్త చిత్రానికి కూడా ఈ లీకుల బెడద చుట్టుముట్టడం యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
‘ది ప్యారడైజ్’ తర్వాత నాని ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని పబ్లిక్ లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. అయితే, బహిరంగ ప్రదేశంలో చిత్రీకరణ జరపడమే మూవీ టీమ్‌కు అసలైన సమస్యగా మారింది. లొకేషన్‌లో నాని లుక్‌ను, కీలక సన్నివేశాలను స్థానికులు తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో నాని లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన విజువల్స్ అన్నీ బయటకు వచ్చేయడంతో మేకర్స్ అసహనానికి లోనవుతున్నారు.
ఇలా ఓపెన్ లొకేషన్లలో షూట్ చేసేటప్పుడు చిత్ర యూనిట్ సరైన జాగ్రత్తలు, ప్రైవసీని పాటించకపోతే కష్టపడి డిజైన్ చేసుకున్న సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ రిలీజ్‌కు ముందే బూడిదలో పోసిన పన్నీరవుతాయని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే షెడ్యూల్స్‌లోనైనా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలసి వెంకట్ బోయనపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2027 వేసవి కానుకగా విడుదల కానున్న ఈ ‘బ్లడీ రోమియో’ చిత్ర బృందం ఇకనైనా ఈ లీకుల గోలకు పక్కాగా చెక్ పెడుతుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు అర్థమేంటి?
NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?