Simbu: శింబును అవమానించిన విరాట్ కోహ్లీ.. హీరో అని చెప్పినా కూడా
ABN , Publish Date - Jul 16 , 2025 | 08:43 PM
స్టార్స్ అయినా కూడా కొన్నిసార్లు బయట వారికి అవమానాలు తప్పవు. స్టార్స్ అయినంత మాత్రానా అందరూ వారిని గుర్తుపట్టాలన్నా రూల్ కూడా ఏమి లేదు.
Simbu: స్టార్స్ అయినా కూడా కొన్నిసార్లు బయట వారికి అవమానాలు తప్పవు. స్టార్స్ అయినంత మాత్రానా అందరూ వారిని గుర్తుపట్టాలన్నా రూల్ కూడా ఏమి లేదు. కానీ, హీరో అని తనను తాను పరిచయం చేసుకున్నా కూడా ఒక స్టార్ క్రికెటర్ ఏమి పట్టనట్లు.. ముఖం మీదే మీరెవరో నాకు తెలియదని చెప్పి వెళ్లిపోయాడని ఒక హీరో బాధపడ్డాడు. అది కచ్చితంగా ఆ హీరోకు అవమానమే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.. ? ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనేది చూద్దాం.
కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువారికి కూడా ఆయన సుపరిచితుడే. హీరోగా, సింగర్ గా శింబుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్యనే థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన శింబు భారీ పరాజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం శింబు.. వెట్రిమారన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో శింబు గతంలో తనకు జరిగిన ఒక అవమానం గురించి చెప్పుకొచ్చాడు. స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తానెవరో తెలియదు అన్నాడని చెప్పుకొచ్చాడు.
' ఒకసారి విరాట్ కోహ్లీని కలిశాను. నాకు నేనే పరిచయం చేసుకున్నాను. నా పేరు శింబు.. హీరోగాచేస్తున్నాను అని చెప్పాను. అయితే అతను మాత్రం క్షమించండి.. మీరెవరో నా తెలియదు అంటూ వెళ్ళిపోయాడు. కొన్నేళ్ల తరువాత ఆర్సీబీ రీల్ లో నేను నటించిన పాతు తలా సినిమాలోని నే సింగం దాన్ సాంగ్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ నాకు తెలియలేదు అతనికి నేను తెలుసో లేదో' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శింబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిజంగా విరాట్.. శింబు ఎవరితో తెలియదు అన్నాడా.. ? అప్పుడు తెలియకపోయినా.. ఆ తరువాత తెలిసి ఉండొచ్చు అని కొందరు అంటుండగా.. ఇది కచ్చితంగా శింబును అవమానించడమే అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
Kanappa: రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప ప్రత్యేక ప్రదర్శన
The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రాజాసాబ్ మళ్లీ వాయిదా