సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

ABN, Publish Date - Nov 16 , 2026 | 08:29 PM

యంగ్ హీరోయిన్ మృణాళిని రవి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడిని పెళ్లాడారు. ఈ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Mirnalini Ravi Mahavishnu Wedding

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఆ తర్వాత ‘ఎనిమీ’, ‘కోబ్రా’, ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ వంటి చిత్రాలతో టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ మృణాళిని రవి (Mirnalini Ravi) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు మహావిష్ణు (Mahavishnu)ను ఆమె వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల క్రితమే మహావిష్ణుతో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మృణాళిని, తాజాగా ఆయనతో కలిసి ఏడడుగులు వేశారు.


మలేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపమైన లంకావి (Langkawi) వేదికగా ఆదివారం (నవంబర్ 15) వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన అత్యంత మధురమైన క్షణాలను మృణాళిని రవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. లేత గులాబీ రంగు పట్టుచీర, సంప్రదాయ ఆభరణాలతో మృణాళిని పెళ్లికూతురిగా మెరిసిపోతుండగా.. క్రీమ్ కలర్ పట్టు పంచె, కుర్తాలో వరుడు మహావిష్ణు ఎంతో హుందాగా కనిపించారు. మంగళసూత్ర ధారణ సమయంతో పాటు నుదుట సిందూరం దిద్దుతున్న ఆత్మీయ దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.


డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి, ఆపై వెండితెరపై హీరోయిన్‌గా ఎదిగిన మృణాళిని.. తమిళంలో ‘సూపర్ డీలక్స్’, ‘ఛాంపియన్’ వంటి చిత్రాలతో పాటు తెలుగులోనూ వరుస సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ గుర్తింపు పొందిన మహావిష్ణుతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రకటించినప్పటి నుంచే వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఎదురుచూపులకు తెరదించుతూ.. ఆమె విష్ణువుతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ నూతన దంపతుల ఫోటోలను చూసి సినీ ప్రముఖులు, అభిమానులు ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

సోల్‌‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?

యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ

ఘనంగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం.. తళుక్కుమన్న స్టార్స్

Updated Date - Nov 16 , 2026 | 08:29 PM