కాబోయే జంటకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణ ఆశీస్సులు

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:09 PM

యంగ్ హీరో తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థ వేడుక సోమవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

యంగ్ హీరో తేజ సజ్జా, మౌర్యల (Teja Sajja - Mourya) నిశ్చితార్థ వేడుక సోమవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna)ఈ వేడుకలో పాల్గొని తేజ సజ్జా, మౌర్యలకు ఆశీస్సులు అందించారు. మెగాస్టార్‌ చిరంజీవి, తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మంత్రి సీతక్క, హరీశ్‌ రావు, గంటా శ్రీనివాసరావు తదితర రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

RK-SIR.jpg

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, దిల్‌ రాజు, టీజీ విశ్వప్రసాద్‌, సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, వెంకట్‌ బోయనపల్లి పాల్గొన్నారు. నటులు శ్రీకాంత్‌, రవితేజ, నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్‌, సుధీర్‌ బాబు, వరలక్ష్మి శరత్‌కుమార్‌, నిధి అగర్వాల్‌, నిహారిక కొణిదెల, రితికా నాయక్‌, ఇమాన్వి తదితరులు హాజరై సందడి చేశారు.

దర్శకుల విభాగం నుంచి బి. గోపాల్‌, అనిల్‌ రావిపూడి, ప్రశాంత్‌ వర్మ, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, కార్తీక్‌ ఘట్టమనేని, మారుతి, చందూ మొండేటి, శైలేష్‌ కొలను, బీవీఎస్‌ రవి తదితరులు వేడుకకు విచ్చేసి కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్‌లో వీరిద్దరి వివాహం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా జరగనుంది.

Updated Date - Nov 16 , 2026 | 07:12 PM