మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్
ABN, Publish Date - Oct 07 , 2026 | 01:47 PM
సుహాస్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన మండాడి సినిమా తమిళనాడులో కొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేసింది. ఈ చిత్రం తమిళనాడులో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది.
తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని చోట్లా ‘మండాడి’కి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడులో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా, ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని చూసుకుంటే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘మండాడి’ నిలిచింది. ‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని నిలబెట్టాయి. ఈ చిత్రాన్ని వీక్షించి రజనీకాంత్, వెట్రిమారన్ తదితరులు చిత్రబృందాన్ని అభింనందించారు.
ఇవి కూడా చదవండి:
అభిమాని హత్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్
ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!
నిన్న రాజశేఖర్.. నేడు విజయ శాంతి! అసలు బాలయ్యతో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివయ్య