The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:50 PM

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ది ట్రైటర్స్(The Traitors) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్‌లతో సాగే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు యంగ్ అండ్ వర్సటైల్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

The Traitors Telugu

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ది ట్రైటర్స్(The Traitors) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్‌లతో సాగే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు యంగ్ అండ్ వర్సటైల్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తేజ సజ్జా హోస్ట్ అనగానే ఈ షోపై హైప్ పెరిగింది. ఇక తాజాగా ఈ షోలో పాల్గొనబోతున్న 20 మంది కంటెస్టెంట్స్ అధికారిక లిస్ట్‌ను మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అయింది.


ఈ షోలో సినీ, డిజిటల్, రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు భాగం కాబోతున్నారు. వారెవరు అంటే నటుడు,రచయిత హర్షవర్ధన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి, హాస్య నటి విద్యుల్లేఖ రామన్, కమెడియన్ విష్ణు ఓయ్, హీరో సాయి రోనాక్, సింగర్ చిన్మయి శ్రీపాద ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ, ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ కూడా సందడి చేయనున్నారు.


డిజిటల్ మీడియా, యూట్యూబ్ నుంచి పాపులర్ యూట్యూబర్ వర్ష డిసౌజా, ఇషా వ్లోగ్స్ మౌనీష చౌదరి, కంటెంట్ క్రియేటర్ గౌరవ్ సునీల్, హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహలతో పాటు అభినవ కవి ర్యాపర్ ప్రణవ్ చాగంటి, గేమర్ పుప్పాల ధనంజయ్, కొరియోగ్రాఫర్ ఫల్గుణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బిజినెస్ రంగం నుంచి శ్రీదేవి చౌదరి, రాహత్ అచ్చంట, షోస్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, నటి ఆషికా కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. విభిన్న మనస్తత్వాలు ఉన్న ఈ 20 మంది కంటెస్టెంట్స్‌తో తేజ సజ్జా నడిపించే ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌‌మెంట్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇక ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 20 మంది కంటెస్టెంట్స్ లో తేజ సజ్జా కొందరిని ట్రేటర్స్ గా సెలెక్ట్ చేస్తారు.మిగతవారు ట్రేటర్ ఎవరు అని కనుక్కోవడమే గేమ్. ఇందులో చలా మోసాలు, వెన్నుపోట్లు ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.20 మంది కంటెస్టెంట్స్ లో చాలామంది ప్రేక్షకులకు తెలిసినవారే కావడంతో ఈ షోపై ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్ కంటే వీళ్ళే బావున్నారు కదరా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇదికదా అసలు సిసలైన రియాలిటీ షో అని చెప్పుకొస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 15 నుంచి ది ట్రైటర్స్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 06 , 2026 | 05:58 PM