సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడనుకున్న టైటిల్ ఇప్పుడు.. కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్‌ టైటిల్ ఇదే

ABN, Publish Date - Nov 06 , 2026 | 07:04 PM

లోకనాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ పుట్టినరోజు (నవంబర్ 7) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ట్రీట్ వచ్చేసింది. ఆయన నటిస్తోన్న నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు.

Kamal Haasan Sandiyar

లోకనాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) పుట్టినరోజు (నవంబర్ 7) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ట్రీట్ అందింది. ఇటీవల ‘చిత్తా’ చిత్రంతో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేయబోయే మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘సండియార్’ (Sandiyar) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.


గతంలో కమల్ హాసన్ క్లాసిక్ కల్ట్ హిట్ ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’) సినిమాకు మొదట ‘సండియార్’ అనే పేరునే పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఈ లైన్స్‌తో వచ్చే సాంగ్.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు అనుకున్న టైటిల్.. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు కమల్ హాసన్ హీరోగానే సినిమా వస్తుండటంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ పూర్తి రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీతో నిండిపోయింది. పాతకాలపు కారు బయట నిలబడి, సీరియస్‌గా చూస్తూ, చేతిలో గన్ పట్టుకుని రక్తం ఓడుతున్న కారు డోర్‌పై చేయి వేసిన కమల్ హాసన్ లుక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆయన గెడ్డం, కళ్లలోని రౌద్రం సినిమాలోని రా యాక్షన్ కంటెంట్‌కు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ భారీ ప్రాజెక్ట్‌కి సౌత్ ఇండియన్ సినిమా టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం, అన్బరివ్ (Anbariv) మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ, సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ, సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనింగ్, అమృత రామ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తుండగా.. టర్మ్‌రిక్ మీడియా బ్యానర్‌తో కలిసి ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్. డిస్నీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘విక్రమ్’ తర్వాత కమల్ హాసన్ - అనిరుధ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, దానికి తోడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ యాక్షన్ తోడవ్వడంతో ‘సండియార్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ.. ఇదెవరూ ఊహించలేదు కదా

‘కాకా’ సంక్రాంతికే.. రూమర్స్‌కు కోన వెంకట్ కౌంటర్

బండి సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ చూశారా

Updated Date - Nov 06 , 2026 | 07:04 PM