Kamal Haasan : కమల్‌హాసన్ చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2023-11-10T12:06:52+05:30 IST

దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ (Suprstar krishna)విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని విశ్వనటుడు (kamal haasan) కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.

Kamal Haasan :  కమల్‌హాసన్  చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ

దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ (Suprstar krishna)విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని విశ్వనటుడు (kamal haasan) కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేశ్‌బాబు (maheshbabu) అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌-2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగా కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. (krishna idol)

'ఇండియన్‌-2’ తోపాటు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 ఎడీ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హెచ్.  వినోద్‌ దర్శకత్వంలో 'Kamal haasan 233', మణిరత్నం దర్శకత్వంలో 'థగ్స్‌లైఫ్‌’ చిత్రాలు చేస్తున్నారు.

Updated Date - 2023-11-10T13:52:43+05:30 IST