Kamal Haasan : తమ్ముడూ... నిన్ను చూసి గర్విస్తున్నా

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:20 AM

తమిళ హీరో, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను అభినందనల్లో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో

Kamal Haasan : తమ్ముడూ... నిన్ను చూసి గర్విస్తున్నా

తమిళ హీరో, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను అభినందనల్లో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయాన్ని అందుకున్న సందర్భంగా ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను తమ్ముడూ అంటూ’ పవన్‌పై ప్రశంసలు కురిపించారు. శుక్రవారం ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ ద్వారా పవన్‌ విజయంపై స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ మున్ముందు తన రాజకీయ జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఈ ప్రయాణంలో విజయం సాధించాలి, ప్రజల ఆశలు, ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చాలి అని ఆకాంక్షించారు.

Updated Date - Jun 08 , 2024 | 05:20 AM