Kamal Haasan : సవాళ్లు ఎదుర్కొని.. ఆ హద్దుల్ని చెరిపేశారు!

ABN , First Publish Date - 2023-06-02T14:50:38+05:30 IST

అపురూప చిత్రాల దర్శకుడు మణిరత్నం (Maniratnam) పుట్టినరోజు సందర్భంగా విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని (HBD Mani Ratnam) పంచుకున్నారు.

Kamal Haasan : సవాళ్లు ఎదుర్కొని.. ఆ హద్దుల్ని చెరిపేశారు!

అపురూప చిత్రాల దర్శకుడు మణిరత్నం (Maniratnam) పుట్టినరోజు సందర్భంగా విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని (HBD Mani Ratnam) పంచుకున్నారు. ‘‘మన చుట్టూ ఉన్న ఆనందాన్ని బట్టి జీవితాన్ని లెక్కించాల్సి వస్తే, ఆ ఆనందాన్ని క్రియేట్‌ చేసిన వ్యక్తి వయసును కూడా లెక్కించాలి. అలా పరిగణిస్తే నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మణిరత్నం ఈ రోజు మరింత పెద్ద వ్యక్తి కాబోతున్నారు. దర్శకుడిగా ఆయన ప్రతిభతో కోట్ల హృదయాలను హత్తుకున్నారు. భారతీయ సినిమా రంగానికి చెందిన విశిష్ఠమైన వ్యకి. ఆయన చిత్రాల్లో అద్భుతమైన మాటలు, విజువల్స్‌తో ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగించారు. సవాళ్లను సైతం ఎదుర్కొన్ని సినిమా హద్దుల్ని చెరిపేశారు. సినిమాకు ప్రాంతీయ భేదం లేకుండా చేశారు. నెక్ట్స్‌ జనరేషన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు మీరొక మాస్టర్‌(Next Generation master). మీ లెగసీ, వారసత్వం వారి ద్వారా శాశ్వతంగా ముందుకు కొనసాగుతుంది. ‘నాయకన్‌’ చిత్రం నుంచి ‘కెహెచ్‌234’ (KH234)వరకూ వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ మనిద్దరి జర్నీ ఓ వరం. అది దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తా. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి మిత్రమా’’ అని కమల్‌హాసన్‌ ట్వీట్‌ చేశారు.

35 ఏళ్ల క్రితం కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో ‘నాయకన్‌’ (నాయకుడు) చిత్రం వచ్చింది. మళ్లీ ఈ కలయికలో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 35 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయిలో సినిమా రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ‘కమల్‌హాసన్‌ 234’ (Kamal Haasan 234) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ప్రారంభం కానుంది. మద్రాస్‌ టాకీస్‌, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, రెడ్‌ గెయింట్‌ మూవస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Updated Date - 2023-06-02T14:53:57+05:30 IST