Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!

ABN , Publish Date - Jun 18 , 2026 | 09:27 AM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ హీరోగా నటించిన ‘జననాయగన్‌’ సెన్సార్‌ వివాదానికి పరిష్కారం లభిస్తే.. రిలీజ్ అవడానికి రెండు డేట్స్‌ని నిర్మాత ఫిక్స్ చేసుకుని ఉన్నారు. మరి ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందేమో చూద్దాం.

Jana Nayagan Release Update

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (Tamil Nadu CM Vijay) హీరోగా నటించిన ‘జననాయగన్‌’ (Jana Nayagan) సెన్సార్‌ వివాదానికి పరిష్కారం లభిస్తే ఈ నెల 26 లేదా జూలై 3వ తేదీన విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. హెచ్‌. వినోద్‌ (H Vinoth) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా గత జనవరి 9వ తేదీన విడుదలకావాల్సి ఉంది. కానీ, సెన్సార్‌ వివాదంలో చిక్కుకోవడంతో ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన రివ్యూ కమిటీ ఈ సెన్సార్‌ సర్టిఫికేట్‌ మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాను జూన్‌ 26 లేదా జూలై 3వ తేదీన విడుదల చేయాలని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ భావిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్‌, ప్రియమణి, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు నటించగా అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.


వాస్తవానికి ‘జననాయగన్’ సినిమా 2026 జనవరి 9వ తేదీన పొంగల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సినిమా టీమ్ అందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కూడా. అలాంటి సమయంలో సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చింది. 2025 డిసెంబర్ 18వ తేదీన ‘జననాయగన్’ సినిమా ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు అనుమతి కోసం పంపగా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 22వ తేదీన సినిమా టీమ్‌కు మెయిల్ పంపి.. కొన్ని మార్పులు కూడా సూచించింది. సినిమా టీమ్ మార్పులు చేసి మళ్లీ బోర్డుకు సినిమాను పంపగా.. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి రాలేదు. సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, దీన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు మెయిల్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా వార్తలలో నిలుస్తూనే ఉంది.


రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవటం, అసలు ఫిర్యాదు చేసింది ఎవరో తెలియకపోవటంతో ‘జననాయగన్’ టీమ్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు సెన్సార్ పూర్తి చేయాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే ఎన్నికలు రావటం, సినిమాలోని సీన్స్ లీక్ అవటం, లీక్ చేసిన వారిని పట్టుకోవడం.. ఇలా వరసగా ఏదో ఒకటి జరుగుతూనే వచ్చింది. ఈ క్రమంలో ‘జననాయగన్’ హీరో విజయ్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ ముఖ్యమంత్రి అయినా.. సినిమా విడుదల ఆలస్యం అవుతూనే ఉంది. ఈసారి ఈ సినిమా విడుదలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం మరి, ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!

మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా?

‘బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..

Updated Date - Jun 18 , 2026 | 09:27 AM

Jana Nayagan: ఆ ఒక్కడి అభ్యంతరం.. జన నాయగన్ వాయిదా! కోట్ల న‌ష్టం

Jana Nayagan: తన రికార్డును తానే బ్రేక్ చేసిన విజయ్

Jana Nayagan: లీకేజీలు ఉండొచ్చు.. ఓటీటీలు హ్యాండ్ ఇవ్వొచ్చు.. కానీ..

Jana Nayagan: ఓపిక లేదా? జన నాయగన్‌పై.. హైకోర్టు ఆగ్రహం! సింగిల్ జడ్జి తీర్పుపై స్టే

Jana Nayagan: తెలుగులో జన నాయకుడు గా...