సూర్య థింకింగే వేరు.. అసలిలా ఎవరూ ఊహించి ఉండరు!

ABN , Publish Date - Jun 01 , 2026 | 07:46 PM

కోలీవుడ్‌లో తనను ఎందుకు అందరూ అంతగా అభిమానిస్తారో నటుడు సూర్య మరోసారి నిరూపించారు. ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించి.. తన కృతజ్ఞతను చాటుకుంటున్నారు.

Hero Suriya

కోలీవుడ్‌లో తనను ఎందుకు అందరూ అంతగా అభిమానిస్తారో నటుడు సూర్య (Suriya) మరోసారి నిరూపించారు. చాలా కాలంగా హిట్టు కోసం సూర్య వేచి చూస్తున్నారు. వరుస పరాజయాలతో డీలా పడిన సూర్యపై ఆ మధ్య రకరకాల వార్తలు వచ్చాయి. ఇక సూర్య సినిమాలు మానేస్తే బెటర్ అనేలా కూడా కొందరు కామెంట్స్ చేశారు. అలాంటి వారందరి నోళ్లకూ తాళం వేస్తూ.. ‘కరుప్పు’ (Karuppu)తో సెన్సేషనల్ సక్సెస్‌ని అందుకున్నారు సూర్య. చాలా గ్యాప్ తర్వాత తనకు వచ్చిన ఈ సక్సెస్‌‌కు కారణమైన వారిని సర్‌ప్రైజ్ చేస్తూ.. సూర్య తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన చిత్ర కీలక సభ్యులకు సూర్య ఊహించని గిఫ్ట్‌తో కృతజ్ఞతను చాటుకుంటున్నారు. సినిమా కోసం వారు పడిన కష్టానికి, అంకితభావానికి గుర్తింపుగా.. ఎవరూ ఊహించని విధంగా చిత్ర సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌లకు సరికొత్త లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చారు.


సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే కేవలం దర్శకుడిని మాత్రమే సత్కరించి, తెర వెనుక కీలక పాత్ర పోషించే ఇతర సాంకేతిక నిపుణులను పెద్దగా పట్టించుకోని ఆనవాయితీ ఇండస్ట్రీలో ఉంది. అలాగే నిర్మాతకు భారీగా లాభాలు వస్తే.. హీరో, సంగీత దర్శకులకు కార్లు ఇవ్వడం ఇప్పటి వరకు అంతా చూశారు. కానీ, ఫస్ట్ టైమ్ సూర్య మాత్రం అలా కాకుండా, తెర వెనుక శ్రమించే టెక్నీషియన్ల శ్రమను గుర్తించి గౌరవించడంపై ఇండస్ట్రీ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాములుగా అయితే.. సినిమా విజయాన్ని తమ అభిమానులు లేదా తోటి నటీనటులతో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇలా సాంకేతిక బృందంలోని ముఖ్య సభ్యులకు పర్సనల్‌గా ఇంత విలువైన బహుమతులు అందించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.


దీనిని బట్టి చూస్తే.. సూర్య కెరీర్‌లో ‘కరుప్పు’ సినిమా ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో ఒక భారీ బ్లాక్‌బస్టర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సూర్యకు, ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, సినిమా మేకింగ్ అనేది అందరి ఉమ్మడి కృషి అనే తన నమ్మకాన్ని సూర్య ఈ నిర్ణయంతో నిజం చేసి చూపించారు. తనతో కలిసి పనిచేసే వారిని గౌరవిస్తూ.. విజయాన్ని అందరి విజయంగా భావించే సూర్య గొప్ప మనసు ఆయన ప్రతిష్టను మరింత పెంచిందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

Updated Date - Jun 01 , 2026 | 07:46 PM

Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..

Suriya-jyotika: స్వర్గంలో మరో రోజు మనిద్దరం

Suriya 42: భారీ బడ్జెట్‌కు రాజమౌళే కారణం

Suriya 46: సూర్య, వెంకీ అట్లూరి మూవీ షూటింగ్ షురూ

Suriya: డ్యాన్స్‌ రాదన్నారు. ఫైట్స్‌ రావన్నారు.. మరి ఇప్పుడు..