Suriya 42: భారీ బడ్జెట్‌కు రాజమౌళే కారణం

ABN , First Publish Date - 2023-03-22T16:52:23+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూర్య (Suriya) ఒకరు. ప్రస్తుతం ఆయన సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘సూర్య 42’ (Suriya 42) అని వ్యవహరిస్తున్నారు.

Suriya 42: భారీ బడ్జెట్‌కు రాజమౌళే కారణం

కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూర్య (Suriya) ఒకరు. ప్రస్తుతం ఆయన సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘సూర్య 42’ (Suriya 42) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్య మార్కెట్‌తో పోల్చుకుంటే ఈ మూవీ కోసం మూడింతల బడ్జెట్‌ను వెచ్చిస్తున్నామని మేకర్స్ తెలిపారు.

స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సూర్య 42’ ను నిర్మించడానికి రాజమౌళి వేసిన బాటనే కారణమని చెప్పారు. ‘‘దర్శకుడు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ను చూశాక నేను సాధారణ సినిమాను నిర్మించడం లేదని నాకు అర్థమైంది. సూర్య మార్కెట్‌తో పోల్చితే మూడింతల బడ్జెట్‌ను చిత్రం కోసం వెచ్చిస్తున్నాం. హీరోకు కూడా బడ్జెట్ తెలియదు. బడ్జెట్ గురించి చెబితే ఆందోళనకు గురవుతారని చెప్పలేదు. నిర్మాతలు నష్టపోకూడదని సూర్య అనుకుంటుంటారు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అందువల్ల సూర్యకు బడ్జెట్ గురించి చెప్పలేదు. పాన్ ఇండియా సినిమాలకు బాటలను వేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. పుష్ప, సూర్య 42 ఏదైనా భారీ ప్రాజెక్టు గురించి బాలీవుడ్ వాకబు చేస్తుందంటే అందుకు ముఖ్య కారణం ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli). ఆయన ‘బాహుబలి’ కి దర్శకత్వం వహించి ఉండకపోతే బాంబేలో మనకు పని ఉండేది కాదు. సూర్య 42ను భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి రాజమౌళే కారణం. ఆయన భారీ బడ్జెట్‌తో బాహుబలిని తెరకెక్కించి మాకు బాటలు వేశారు. ఒకవేళ బాహుబలి రాకపోయింటే మేం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేవాళ్లం కాదు’’ అని జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.

‘సూర్య 42’ ను రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 3డీ పీరియాడిక్ డ్రామాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. దాదాపుగా 10భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Mrunal Thakur: నా కథను ప్రపంచానికి చెబుతా.. కన్నీరు కారుస్తున్న ఫొటోను షేర్ చేసిన మృణాల్..

Thalaivi: వివాదంలో కంగన సినిమా.. కోర్టును ఆశ్రయించనున్న డిస్ట్రిబ్యూటర్..

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Updated Date - 2023-03-22T16:52:25+05:30 IST