సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుహాస్ స్పీడ్ మాములుగా లేదు.. మరో మూవీ షూటింగ్ పూర్తి!

ABN, Publish Date - Apr 25 , 2026 | 04:30 PM

సుహాస్ రీసెంట్‌గానే ‘హే బల్వంత్’ అంటూ ప్రేక్షకులని పలకరించారు. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుండగానే, ఇప్పుడు తను చేస్తున్న మరో మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేసేశారు.

Suhas Mandaadi Update

సుహాస్ (Suhas) రీసెంట్‌గానే ‘హే బల్వంత్’ (Hey Balwanth) అంటూ ప్రేక్షకులని పలకరించారు. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుండగానే, ఇప్పుడు తను చేస్తున్న మరో మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేయడం విశేషం. సుహాస్, సూరి (Soori) ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుందనే విషయం ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.


ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. ‘‘ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంతో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశాం. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశాం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు.


సూరి, సుహాస్‌ ఇద్దరూ ఈ సినిమాలోని తమ పాత్రలకు తగ్గట్టుగా శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సందడి చేసిన సుహాస్.. ఈ సినిమాతో కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించినట్లుగా ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌తో పాటు, గత చిత్రాల ప్రమోషన్స్‌లో కూడా ఆయన తెలిపి ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల కాల్ షీట్‌లను ఇవ్వడం చూస్తుంటే.. అతనికి ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటివారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 04:30 PM