సమస్యలు సృష్టిస్తే ప్రజాగ్రహానికి గురవుతారు- రాఘవ లారెన్స్
ABN, Publish Date - May 10 , 2026 | 09:53 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును ప్రతి రాజకీయ నేత గౌరవించాలని దర్శక నటుడు రాఘవ లారెన్స్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన రియాక్ట్ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును ప్రతి రాజకీయ నేత గౌరవించాలని దర్శక నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) అన్నారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో హీరో విజయ్ (Thalapathy Vijay) సారథ్యంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118కు మరో 10 సీట్ల దూరంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
‘‘ప్రజల తీర్పు మహేశ్వరుడి తీర్పు. ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. వారి ఆదేశానుసారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ప్రజా తీర్పును గౌరవించాలి. ప్రజా తీర్పును గౌరవించే నేతలు ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు. అలా కాకుండా.. సమస్యలు, చీలికలు తేవాలని ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చివరగా, నేతలందరూ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలా పనిచేయాలి. ప్రజా తీర్పును గౌరవించాల్సిందే’’ అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.
మే 4న రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మే 9వ తేదీ రాత్రి వరకు తమిళనాడు పాలిటిక్స్ (Tamil Nadu Politics) ఎంత రసవత్తరంగా నడిచాయో తెలియంది కాదు. ఈ రసవత్తర రాజకీయాలపైనే రాఘవ లారెన్స్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే, మే 9 (శనివారం) విజయ్ తనకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను రాబట్టగలిగారు. ఈ క్రమంలో తొలుత కాంగ్రెస్ (ఐదుగురు ఎమ్మెల్యేలు) మద్దతు తెలిపింది. ఆ తరువాత సీపీఐ (ఇద్దరు ఎమ్మెల్యేలు), సీపీఎం (ఇద్దరు ఎమ్మెల్యేలు) విజయ్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో, విజయ్ సంఖ్యాబలం 116కు చేరింది. దాదాపు మూడు రోజుల సస్పెన్స్ తరువాత శనివారం వీసీకే (ఇద్దరు ఎమ్మెల్యేలు), ఐయూఎంఎల్ (ఇద్దరు ఎమ్మెల్యేలు) కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ సంఖ్యాబలం మ్యాజిక్ మార్కును దాటి 120కు చేరింది.
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!