సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో మాళవికకు ఛాన్స్!
ABN, Publish Date - May 10 , 2026 | 11:42 AM
2008లో వచ్చిన సూపర్‌డూపర్ హిట్ మూవీ ‘సిలంది’కి రెండో భాగం తెరకెక్కనుంది. మలయాళ నటి మాళవిక మేనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు.
2008లో వచ్చిన సూపర్‌డూపర్ హిట్ మూవీ ‘సిలంది’ (Silandhi)కి రెండో భాగం తెరకెక్కనుంది. మలయాళ నటి మాళవిక మేనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఆదిరాజన్ ఈ చిత్ర దర్శకుడు. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ, ‘సిలంది-2’ (Silandhi 2) నేను దర్శకత్వం వహించే ఐదో చిత్రం. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి భాషల్లో రూపొందిస్తాం. కాంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో షూటింగ్ జరుపుతాం. ‘లోకా’, ‘కాంతార’ తరహాలో గ్రాఫిక్స్ హైలెట్స్‌గా ఈ చిత్రం ఉంటుంది. 2008లో వచ్చిన తొలిభాగంలో మున్నా, మోనిక, రియాజ్ ఖాన్ ప్రధాన పాత్రలను పోషించారు. తొలిభాగం తరహాలోనే రెండో భాగాన్నికూడా హారర్ మూవీగా రూపొందించేలా కథను సిద్ధం చేశాం. ఈ సీక్వెల్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
‘సిలంది’ (2008) విషయానికి వస్తే.. ఇది 2008లో వచ్చిన ఒక ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా. నటి మోనిక గ్లామరస్ రోల్‌లో కనిపించి అప్పట్లో సంచలనం సృష్టించారు. కథ విషయానికి వస్తే.. ఒక కొత్త జంట హనీమూన్ కోసం ఒక రిమోట్ విల్లాకు వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన వింత అనుభవాలు, మోనిక గతం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది హాలీవుడ్ మూవీ ‘I Know What You Did Last Summer’ ప్రేరణతో తీశారని అప్పట్లో టాక్ ఉండేది. ఈ సినిమాను తెలుగులో ‘ఎర్ర గులాబీ’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!