సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

LIK: పాపం ప్రదీప్ బుక్కయ్యాడు.. ఆ హీరో సేఫ్!

ABN, Publish Date - Apr 17 , 2026 | 07:00 PM

ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ‘లవ్ టుడే’, ‘డ్యూడ్’, ‘డ్రాగన్’ చిత్రాలతో హీరోగా హ్యాట్రిక్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ సక్సెస్‌ఫుల్ జర్నీకి, తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ బ్రేక్ వేసింది.

Pradeep Ranganathan in LIK

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ‘లవ్ టుడే’, ‘డ్యూడ్’, ‘డ్రాగన్’ చిత్రాలతో హీరోగా హ్యాట్రిక్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ సక్సెస్‌ఫుల్ జర్నీకి, తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance kompany) బ్రేక్ వేసింది. నయనతార నిర్మాతగా, ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. దీంతో ప్రదీప్‌కు మొదటి పరాజయం ఎదురైంది. వాస్తవానికి ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆయనకు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా తెలుగు నిర్మాతలు కొందరు రెడీగా ఉన్నారు. అలాంటి రేంజ్ ఉన్న ప్రదీప్‌కు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమాకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..


ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా 2019లో మొదలైంది.. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కొన్ని వివాదాల అనంతరం ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. 2020లో ఈ సినిమా విడుదలై ఉంటే, ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రదీప్ కూడా అంతగా ఆలోచించేవాడు కాదేమో. కానీ, ఇప్పుడతనికి ఒక స్టార్‌డమ్ ఉంది. ఇలాంటి టైమ్‌లో విడుదలవడం, అతని జర్నీలో ఓ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’కి మొదట అనుకున్న హీరో ఎవరో కాదు.. శివకార్తికేయన్. అవును, శివకార్తికేయన్ హీరోగా విఘ్నేష్ శివన్ ఈ సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.


అప్పుడే ప్రదీప్ రంగనాథన్‌ను విఘ్నేష్ శివన్ ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చారు. షూటింగ్ పూర్తైన తర్వాత విడుదలవడానికే ఈ సినిమా చాలా టైమ్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో ప్రదీప్.. తన సత్తా చాటుకుంటూ వరుస హిట్స్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అపజయమే లేకుండా, తన జర్నీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న ప్రదీప్‌కి.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఒక చేదు అనుభవంగా మిగిలిపోనుంది. వెంటనే, ఒక మంచి హిట్ కొడితే కానీ, మళ్లీ ప్రదీప్ రంగనాథన్‌కు, ఆయన అభిమానులకు కాస్త ఊరట లభించదు. చూద్దాం.. ఎలాంటి ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రదీప్, ప్రేక్షకుల ముందుకు వస్తారో..?

ఇవి కూడా చదవండి:

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

Updated Date - Apr 17 , 2026 | 07:00 PM