‘జననాయగన్’ లీక్.. కెవిఎన్ ప్రొడక్షన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:29 PM

విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో.. ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ షాక్‌కు గురైంది. ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలో రిలీజ్ చేయాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్న నిర్మాతకు, ఇప్పుడిలా పైరసీ కావడం దెబ్బ మీద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి.

KVN Production on Jana Nayagan Leak

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) మూవీ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో.. ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థ షాక్‌కు గురైంది. ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలో రిలీజ్ చేయాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్న నిర్మాతకు, ఇప్పుడిలా పైరసీ కావడం దెబ్బ మీద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. ఒక సినిమా నిర్మాణం జరుపుకుని, విడుదల కాకుండా ఉంటే వచ్చే నష్టంతో పాటు, ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. ఎంత పెద్ద నిర్మాత అయినా, ఈ కష్టం నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసమే ఫైట్ చేస్తున్న నిర్మాతకు, ఈ పైరసీ వ్యవహారం మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను పైరసీ చేసిన వారికి, పైరసీ వీడియోను సోషల్ మీడియాలతో పాటు ఇతరత్రా వాటిలో షేర్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, ఓ నోటీసును విడుదల చేశారు. ఈ నోటీసులో..


‘‘మేము, KVN ప్రొడక్షన్స్ LLP, ‘జననాయకన్’ చలనచిత్ర నిర్మాతలం, ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు మాకే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలు, క్లిప్స్‌తో పాటు సినిమాలోని ఎక్కువ భాగం గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా పైరసీ చేయబడింది. అలా కాపీ కాబడిన సినిమా కంటెంట్ సర్క్యులేట్ చేయబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఇది డిజిటల్ పైరసీకి దారితీస్తూ.. తీవ్రంగా వ్యాపిస్తుందని గమనించాము.

అందుకే మేము ఈ నోటీసు ద్వారా తెలియజేసేది ఏమంటే.. లీక్ కాబడిన కంటెంట్‌ను వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, వెబ్‌సైట్‌లు, టోరెంట్‌లు.. ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా డౌన్‌లోడ్ చేయడం, చూడటం, స్టోర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడం వంటి పనులన్నీ నేరపూరితమైనవి, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని తెలియజేస్తున్నాం. ప్రతి డిజిటల్ చర్యను ట్రేస్ చేయవచ్చు. దీనికి సంబంధించి మేము ఇప్పటికే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌తో సహా అవసరమైన విచారణను మొదలు పెట్టాం. ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదులు చేశాము. ఈ చైన్ సర్క్యులేషన్‌లో ఉన్న ఇతరులను కూడా గుర్తించే పనిలో ఉన్నాం. ఈ తప్పుకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి.


ఇలాంటి లీక్డ్ కంటెంట్‌తో ఎలాంటి సంబంధం కలిగి ఉండవద్దని తెలియజేయడమైనది. ఇందులో ఎవరికైనా లింక్స్ ఉన్నట్లుగా తేలితే, వారందరూ చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అటువంటి కంటెంట్ కనుక మీకు వచ్చినట్లయితే, దానిని ఓపెన్ చేయవద్దు, స్టోర్ చేయవద్దు లేదా ఫార్వార్డ్ చేయవద్దు. వెంటనే దానిని డిలీట్ చేయండి’’ అని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ నోటీసు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంత పెద్ద నిర్మాణ సంస్థ అయి ఉండి, ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నారంటూ.. నెటిజన్లు కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 10 , 2026 | 07:29 PM

Jana Nayagan Movie: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌

Jana Nayagan First Song: దళపతి కచేరి.. అనిరుధ్ గట్టిగా వాయించేశాడు

Jana Nayagan: ఓపిక లేదా? జన నాయగన్‌పై.. హైకోర్టు ఆగ్రహం! సింగిల్ జడ్జి తీర్పుపై స్టే

Jana Nayagan: తన రికార్డును తానే బ్రేక్ చేసిన విజయ్

Jana Nayagan: తెలుగులో జన నాయకుడు గా...