'కాంచన' సిరీస్ ఆగిపోతుందా..?
ABN, Publish Date - May 11 , 2026 | 06:56 PM
వరుస హిట్లు కొడుతున్న ఫ్రాంచైజీ 'కాంచన'. విజయాలే తప్ప అపజయం తెలియకుండా దూసుకుపోతున్న ఫ్రాంచైజీ డైరెర్టర్. బంగారు బాతుగా మారిన ఆ ఫ్రాంచైజీపై ఇప్పుడు ఆ డైరెక్టర్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అభిమానులు అలా ఎందుకు చేస్తున్నాడా అని షాక్ అవుతున్నారు.
అటు హారర్ ఇటు కామెడీ కలగలిపి సినిమాలు హిట్ కొడుతున్న డైరెక్టర్ ఎవరంటే దర్శకుడు రాఘవ లారెన్స్. మునితో మొదలై ‘కాంచన’ సిరీస్‌తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ‘కాంచన’ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. ఇప్పుడు మరో పార్ట్ ‘కాంచన 4’ కూడా రాబోతుండటంతో అభిమానులు ఎగ్జైయిట్ అవుతున్నారు.
‘కాంచన 4’ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ గ్లామర్ స్టార్ నోరా ఫతేహి ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగింది. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘కాంచన 4’ కూడా బలమైన సామాజిక సందేశంతో కూడిన హారర్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. హాలీవుడ్ రేంజ్‌లో గ్రాఫిక్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ‘కాంచన 4’ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ‘కాంచన 4’తో ఈ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ పడనుందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హారర్-కామెడీ యూనివర్స్‌కు ఇక ముగింపు పలకాలని లారెన్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జానర్లు, కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ల వైపు లారెన్స్ ముందుకు వెళ్లాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇవి కూడా చదవండి:
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!