సీఎం విజయ్ తనయుడి ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ABN , Publish Date - May 29 , 2026 | 08:16 PM

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Jason Sanjay and Sundeep Kishan

లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) అధినేత సుభాస్కరన్ (Subaskaran) నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’ (Sigma). తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishen) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.


ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ మంచి స్పష్టత, అంకితభావం, నమ్మకంతో వర్క్ చేశారు. ఆయన విజన్‌ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.


దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన జర్నీగా నిలిచిపోతుంది. నా విజన్‌ను నమ్మి, ప్రతి దశలోనూ అండగా నిలిచిన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ అండ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఎంతో నిబద్ధతతో పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని వదలబోతున్నామని తెలిపారు. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు ఇతక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Updated Date - May 29 , 2026 | 08:16 PM

Sigma Storm: సందీప్ కిష‌న్ సినిమాలో.. సంజ‌య్ గెస్ట్ రోల్‌, స్పెష‌ల్ డ్యాన్స్ నంబ‌ర్‌

Sigma: సిగ్మాగా.. వ‌స్తున్న సందీప్ కిష‌న్‌

Jason Sanjay: మెగాపోన్ పట్టనున్న స్టార్ హీరో కుమారుడు

Jason Sanjay: విజయ్‌ తనయుడు.. డైరెక్ట్ చేస్తున్న చిత్ర హీరో ఎవ‌రు?

Jason Sanjay 01: హీరో విజయ్ సన్ జాసన్ సంజయ్ ఫస్ట్ ఫిల్మ్ మోషన్ పోస్టర్