ప్రైమ్ నుంచి జీ5కి.. దారుణంగా ‘జననాయగన్’ ఓటీటీ డీల్!

ABN , Publish Date - May 03 , 2026 | 10:22 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రంగా చెప్పుకోబడుతున్న ‘జననాయగన్’కు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరిలో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు.

Jana Nayagan Poster

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రంగా చెప్పుకోబడుతున్న ‘జననాయగన్’ (Jana Nayagan)కు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరిలో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. సెన్సార్ ఇష్యూస్‌తో వాయిదా పడుతూ, కోర్టుల వరకు వెళ్లిన ఈ మూవీ రిలీజ్ కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే. ఆ కాంట్రవర్సీని దాటుకుని విడుదలకు సిద్ధమైన తరుణంలో తమిళనాట ఎన్నికలు ఈ సినిమా విడుదలను ఆపేశాయి. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో, మరోసారి విడుదల ఆగిపోవడం, అదే టైమ్‌లో పైరసీ రూపంలో సినిమా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం.. ఇలా ఏదో ఒక రూపంలో ‘జననాయకుడు’ వార్తలలో ఉంటూనే ఉంది. ఇప్పుడు ఓటీటీ రైట్స్ విషయంలో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.


పైరసీ సమయంలో పలువురు సెలబ్రిటీలు చిత్ర నిర్మాణ సంస్థకు అండగా నిలిచారు. ఆ పైరసీకి కారణమైన వారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం, మేకర్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది. ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా అనుకున్నట్టుగా విడుదలై ఉంటే, ఓటీటీ రూపంలో దాదాపు రూ. 120 కోట్లు వచ్చేవి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ సంస్థ ఈ సినిమాను రూ. 120 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాంట్రవర్సీలలో చిక్కుకుని ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ డీల్‌ను వదిలేసుకున్నారట.


ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ప్లేస్‌లో జీ5 (Zee5) ఈ సినిమా రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అయితే మొదట రూ. 120 కోట్లకు వచ్చిన డీల్.. ఇప్పుడు రూ. 50 కోట్లకి పడిపోవడంతో.. చిత్ర నిర్మాతకు మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కాకపోతే.. ఇంకా డీల్ పూర్తి కాలేదని, ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ రైట్స్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూద్దాం.. ఫైనల్‌గా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌‌ను ఎవరు, ఎంతకి కొనుగోలు చేస్తారో?

ఇవి కూడా చదవండి:

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!

Updated Date - May 03 , 2026 | 10:22 PM

Jana Nayagan: ఆ ఒక్కడి అభ్యంతరం.. జన నాయగన్ వాయిదా! కోట్ల న‌ష్టం

Jana Nayagan: ఓపిక లేదా? జన నాయగన్‌పై.. హైకోర్టు ఆగ్రహం! సింగిల్ జడ్జి తీర్పుపై స్టే

Jana Nayagan: తెలుగులో జన నాయకుడు గా...

Jana Nayagan Movie: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌

Jana Nayagan: విజయ్..'జన నాయగన్‌'కు సెన్సార్ చిక్కులు