సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జైలర్‌-2’ వీడియోలు లీక్‌ చేశారో.. నిర్మాణ సంస్థ వార్నింగ్‌!

ABN, Publish Date - Apr 18 , 2026 | 10:29 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జైలర్‌-2’ చిత్రానికి సంబంధించి చిన్న వీడియో లీక్‌ చేసినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ హెచ్చరించింది.

Rajinikanth in Jailer 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జైలర్‌-2’ (Jailer 2) చిత్రానికి సంబంధించి చిన్న వీడియో లీక్‌ చేసినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ హెచ్చరించింది. విజయ్‌ చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan) మూవీ విడుదలకు ముందే లీక్‌ కావడం కోలీవుడ్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలు తీసే నిర్మాతలు తమ చిత్రాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‘జైలర్‌-2’ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ గట్టిగా హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.


‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న ‘జైలర్‌-2’ షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఒక సన్నివేశం సోషల్‌ మీడియాలో లీకై వైరల్‌గా మారిందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ అంశంపై మా పైరసీ విభాగం లోతుగా అధ్యయనం చేస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో షేర్‌ చేసే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్ల వివరాలను సేకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. అందువల్ల నెటిజన్లు లీకైన ‘జైలర్‌-2’ సన్నివేశాలను గ్రూపుల్లో షేర్‌ చేయడం, ఫార్వర్డ్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా మున్ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.


మరో వైపు ‘జననాయగన్’ పైరసీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, షేర్ చేసిన లిస్ట్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితులైన ముగ్గురు వ్యక్తులను సైబర్ క్రైమ్ వింగ్ చాకచక్యంగా పట్టుకుంది. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాధారాల ఆధారంగా.. ‘జననాయగన్’ సినిమా డేటాను దొంగిలించి, పైరసీ కాపీని వ్యాప్తి చేసినందుకు గాను సైబర్ క్రైమ్ వింగ్ మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడని, ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ను యాక్సెస్ చేసి డేటాను దొంగిలించాడని, ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేశాడని.. సైబర్ క్రైమ్ వింగ్ ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

Updated Date - Apr 18 , 2026 | 10:29 PM