సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మామ కోసం అల్లుడి త్యాగం.. రేసు నుంచి త‌ప్పుకున్న 'ఓం'

ABN, Publish Date - Sep 24 , 2026 | 08:26 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఆయన మాజీ అల్లుడు, హీరో. ధనుష్. రేస్ నుంచి తప్పుకున్నారు.

om dhanush

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ( rajini kanth) కోసం ఆయన మాజీ అల్లుడు, హీరో. ధనుష్. రేస్ నుంచి తప్పుకున్నారు. నెల్సన్. దిలీప్ కుమార్ (nelson dileep kumar) దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 (jailer 2) చిత్రం అక్టోబరు 15న విడుదల చేయనున్నారు. 16న అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో ధనుష్ (dhanush) హీరోగా మ‌మ్ముట్టి (Mammootty), సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi), శ్రీలీల (Sreeleela) వంటి భారీ తారాగ‌ణంతో వ‌స్తున్న ఓం (om movie) విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.

అయితే, ఇపుడు 'జైలర్-2' కోసం 'ఓం' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ధనుష్ బుధవారం ప్రకటన విడుదల చేశాడు. అలాగే, దీపావళికి కూడా తమ చిత్రం విడుదల కాదని స్పష్టం చేశారు. ధనుష్ చేసిన ప్రకటనలో.. 'ఎన్నో ఏళ్ళుగా మనమందరం ఆరాదించే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా, మా సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు అక్టోబర్‌ 15న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆయన పట్ల ఉన్న గౌరవంతో మా సినిమా ఓం విడుదలను మరో తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం.

అదే సమయంలో సూర్య (Suriya) సీన్ (Scene) సినిమా దీపావళికి విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల ఈ ఏడాది దీపావళికి కూడా మా సినిమా విడుదల చేయడం లేదు. సినిమా, చిత్రపరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, పెద్ద సినిమాలు పరస్పర అవగాహనతో వ్యవహరించాలని, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించాలని మేము బలంగా విశ్వసిస్తున్నాం. మా సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం ఓం నమశ్శివాయ' అంటూ ధనుష్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 08:26 AM