సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇళయరాజాపై.. ఆస్ట్రేలియా పోస్టల్‌ స్టాంప్‌

ABN, Publish Date - Sep 24 , 2026 | 06:23 AM

సంగీత రంగంలో 50 యేళ్ళ పయనం పూర్తి చేసిన ఇళయరాజా పేరుమీద ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్ర‌త్యేక‌ పోస్టల్‌ స్టాంపును రిలీజ్ చేసింది.

Ilaiyaraaja

తన 50 యేళ్ళ సినీ సంగీత ప్రస్థానంపై ప్రత్యేక పోస్టల్‌ స్టాంపు(postal stamp) ను విడుదల చేసిన ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వానికి సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంగీత రంగంలో 50 యేళ్ళ పయనం పూర్తి చేసిన ఇళయరాజా పేరుమీద పోస్టల్‌ స్టాంపును ఆసీస్‌ సర్కారు రిలీజ్‌ చేయగా, దాన్ని ఇళయరాజా స్వీకరించారు. ఈ సన్మానం ఆస్ట్రేలియా పార్లమెంట్‌ వేదికగా జరిగింది.

దీనిపై ఇళయరాజా ఎక్స్‌ వేదికలో స్పందిస్తూ, ‘తమిళనాడు (Tamil Nadu) లోని ఒక చిన్న మారుమూల గ్రామంలో జన్మించిన నేను ఈ సన్మానం అందుకోవడం మనసుకు హత్తుకునే విషయం’ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 06:49 AM