సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Roja: రోజా ‘లెనిన్ పాండియన్’.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ABN, Publish Date - Oct 16 , 2026 | 01:58 PM

సీనియర్ నటి రోజా  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ళ కిందటి వరకు రాజకీయాల్లో బిజీ గా ఉన్న ఆమె  సినిమాలు, టివి షోలతో అలరించిన సంగతి తెలిసిందే.

సీనియర్ నటి రోజా(Roja)  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ళ కిందటి వరకు రాజకీయాల్లో బిజీ గా ఉన్న ఆమె  సినిమాలు, టివి షోలతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజా కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘లెనిన్ పాండియన్’ (Lenin Pandiyan) తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సడన్ గా డిజిటల్‌ వేదికపై అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహించారు. గంగై అమరన్, జార్జ్ మరియన్, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ: 

అక్రమ ఇసుక తవ్వకాలు, వాటికి అండగా నిలిచే రాజకీయ శక్తులు, వ్యవస్థలోని అవినీతి నేపథ్యంలో ఈ క్రైమ్ డ్రామా రూపొందింది. తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురై ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా స్థానిక ప్రజలకు సమస్యగా మారుతుంది. ఇదే సమయంలో అక్కడి పోలీస్ స్టేషన్‌లో కొత్తగా కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టిన యువకుడు విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. పై అధికారుల నుంచి ఎదురయ్యే అవమానాలు, స్థానిక రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అతడికి ఇబ్బందులు సృష్టిస్తాయి.  అదే ప్రాంతంలో నివసించే వృద్ధ దంపతులు ఇసుక అక్రమ రవాణా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయిస్తారు. అయితే, రాజకీయ అండతో అక్రమ దందా సాగించే వ్యక్తుల నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో యువ కానిస్టేబుల్‌, వృద్ధ దంపతులు కలిసి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తారు. వారి ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? రాజకీయ పలుకుబడి, అవినీతిని ఎదుర్కొని ఇసుక మాఫియాను నిలువరించగలిగారా? చివరకు ఏం జరిగిందన్నదే మిగతా కథ. సామాజిక సమస్యలను క్రైమ్ థ్రిల్లర్ కోణంలో చూపించిన ఈ చిత్రంలో రోజా పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ALSO READ:
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Aishwarya Lekshmi: లైఫ్‌ పార్టనర్‌ ముందు ఎలా ఉండాలంటే..

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

Updated Date - Oct 16 , 2026 | 01:59 PM