సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా

ABN, Publish Date - Nov 21 , 2026 | 07:47 PM

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ప్రతిష్టాత్మక టాక్ షో ‘మెగావర్స్’ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. ఈ షో కి సంబంధించి తదుపరి గెస్ట్‌ల లిస్ట్ ఇలా ఉంది.

Megaverse Latest Update

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ప్రతిష్టాత్మక టాక్ షో ‘మెగావర్స్’ (Megaverse)పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. చిరు తనదైన మార్క్ చమత్కారం, అనుభవాలతో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ స్పెషల్ షో కోసం మేకర్స్ కనీవినీ ఎరుగని రీతిలో స్టార్ గెస్టులను రంగంలోకి దించుతున్నారు. తాజాగా ఈ షో షూటింగ్ షెడ్యూల్, గెస్ట్ లైనప్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో పాల్గొనబోయే స్టార్ల లిస్ట్ చూస్తుంటే సినీ ప్రియులకు మతిపోవడం ఖాయం!


ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల నుంచి అందుతున్న ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం.. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్స్ జరగగా.. నవంబర్ 22 నుంచి వరసగా స్టార్స్ గెస్ట్‌లతో ‘మెగావర్స్’ షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరగనుందని తెలుస్తోంది. మొదటగా నవంబర్ 22న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్‌లతో ఒక ఎనర్జిటిక్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు. ఆ వెంటనే నవంబర్ 24 నుంచి మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని కలిసి పాల్గొనే క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ మొదలుకానుంది. మెగాస్టార్‌కు వీరాభిమానులైన రవితేజ, నాని ఒకే వేదికపై చిరుతో ముచ్చటిస్తుంటే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇక ఈ షో అసలైన హైలైట్ రాబోయే ఎపిసోడ్లలో ఉండబోతోంది. రవితేజ, నాని తర్వాత కోలీవుడ్ స్టార్ ఫ్యామిలీ సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి ‘మెగావర్స్’ సెట్‌లో సందడి చేయనున్నారు. ఆ తర్వాత పాన్-ఇండియా బాక్సాఫీస్ రారాజు రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. చిరు, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ.


అన్నింటినీ మించి, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలైన మెగా ట్రీట్ కూడా ఈ లైనప్‌లో ఉంది. ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొనబోతున్నారు. ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి చేసే సందడి ‘మెగావర్స్’ చరిత్రలోనే అతిపెద్ద ఎపిసోడ్‌గా నిలవనుంది. మొత్తం మీద కమల్ హాసన్, పవన్, ప్రభాస్, సూర్య, రవితేజ, నాని వంటి దిగ్గజాలతో పాటు.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో రూపొందుతున్న ఈ షో ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రసారం కానున్న ఈ షో ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ LLP సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ లిస్ట్‌లోకి నేషనల్ క్రష్

అల్లు అర్జున్‌కు ‘జాయ్ ఆఫ్ లైఫ్’ ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’ వస్తున్నాడు..

Updated Date - Nov 21 , 2026 | 07:47 PM