Megaverse: మెగాస్టార్.. ఎవ్వరినీ వదలడం లేదుగా

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:28 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారి చేస్తున్న ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షో మెగావర్స్ (Megaverse) పై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి.

Megaverse

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారి చేస్తున్న ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షో మెగావర్స్ (Megaverse) పై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కోసం రూపొందుతున్న ఈ షోలో టాలీవుడ్ అగ్ర తారలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు మెగాస్టార్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే అక్కినేని ఫ్యామిలీ, కమల్ హాసన్, సూర్య వంటి స్టార్ గెస్ట్‌లు సందడి చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతుండగా.. ఇప్పుడు ఆ క్రేజీ లిస్ట్‌లో మరో ఇద్దరు స్టార్ హీరోలు చేరినట్లు సమాచారం.


తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని కలిసి మెగావర్స్ షోలో ప్రత్యేక అతిథులుగా పాల్గొనబోతున్నారట. నవంబర్ చివరి వారంలో చిరంజీవితో వీరిద్దరి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్‌కు వీరాభిమానులైన రవితేజ, నాని ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి ఎదురుగా కూర్చుని ముచ్చటిస్తే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. అంతేకాకుండా చిరు తర్వాత సెల్ఫ్ మేడ్ స్టార్స్ గా ఎదిగిన హీరోలుగా రవితేజ, నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ సెల్ఫ్ మేడ్ స్టార్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ, అలాగే మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన నాని.. ఈ ఇద్దరితో బాస్ చేసే మెగా ముచ్చట్లు నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు అగ్ర హీరోలు, మరోవైపు దిగ్గజ నటీనటులతో టాలీవుడ్ మొత్తాన్ని మెగావర్స్ లోకి తీసుకొస్తున్న చిరంజీవి, ఓటీటీ టాక్ షోల చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ముందు ముందు చిరు.. ఏఏ స్టార్స్ ని తీసుకువస్తారో చూడాలి.

Updated Date - Nov 17 , 2026 | 09:32 PM