Netflix Ceo : రామ్‌చరణ్‌తో మీటింగ్‌ కారణం ఏంటో?

ABN , First Publish Date - 2023-12-08T12:59:51+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవికి ఇంటికి విశిష్ఠ అతిథి విచ్చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో టెడ్‌ సరాండోస్‌ గురువారం హైదరాబాద్‌ వచ్చారు.

Netflix Ceo : రామ్‌చరణ్‌తో మీటింగ్‌ కారణం ఏంటో?

మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi) ఇంటికి విశిష్ఠ అతిథి విచ్చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో టెడ్‌ సరాండోస్‌ (TedSarandos) గురువారం హైదరాబాద్‌ వచ్చారు. ఎయిర్‌ పోర్టులో దిగిన వెంటనే నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవితోపాటు ఆయన తనయుడు గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ఆయనకు ఘన స్వాగతం పలికారు. వాళ్లంతా కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. అయితే ఆయన చిరంజీవి ఇంటికి రావడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

టెడ్‌ సరాండోస్‌ వచ్చిన సమయంలో మెగా మేనళ్లులు సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అలాగే నిర్మాతలు శోభు యార్లగడ్డతోపాటు చరణ్‌ మిత్రుడు, నిర్మాత విక్రమ్‌ సైతం ఉన్నారు. టెడ్‌ వెంట నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిథులు కూడా వచ్చారు. మీటింగ్‌ అనంతరం అందరూ దిగిన సెల్ఫీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-12-08T13:00:43+05:30 IST