సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

ABN, Publish Date - May 13 , 2026 | 06:04 PM

డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారెవరు? సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు.. అందరూ డార్లింగ్ అంటే ఎంతగానో ఇష్టపడతారు. ఇతర హీరోల అభిమానులు కూడా అభిమానించే హీరో ఎవరయ్యా? అంటే.. వెంటనే ప్రభాస్ పేరే గుర్తొస్తుంది.

Rebel Star Prabhas

డార్లింగ్ ప్రభాస్ (Darling Prabhas) అంటే ఇష్టపడని వారెవరు? సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు.. అందరూ డార్లింగ్ అంటే ఎంతగానో ఇష్టపడతారు. ఇతర హీరోల అభిమానులు కూడా అభిమానించే హీరో ఎవరయ్యా? అంటే.. వెంటనే ప్రభాస్ పేరే గుర్తొస్తుంది. పేరుకు తగ్గట్టే ప్రభాస్ ఫుడ్ విషయంలో తన పెదనాన్ననే ఫాలో అవుతుంటారు. ప్రభాస్ పెట్టే ఫుడ్‌కి ఫ్యాన్ కాని సెలబ్రిటీ ఎవరు? ఒక్క ఫుడ్ విషయంలోనే కాదు.. ప్రతి విషయంలో ప్రభాస్ హ్యాండ్ ఎప్పుడూ అప్పర్‌లోనే ఉంటుంది. అలాంటి ప్రభాస్ గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న విషయం తెలిస్తే.. ప్రభాస్‌ని అభిమానించే వారు మరింతగా ఆయనకు కనెక్ట్ అవుతారు. అభిమానులు కాని వాళ్లయితే వెంటనే ఆయనకు ఫ్యానిజం మొదలెడతారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..


‘బాహుబలి’ (Baahubali) సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకునే క్రమంలో ఐదేళ్ల పాటు కఠోరంగా శ్రమించిన ప్రభాస్ (Prabhas), తాజాగా తన అత్యుత్తమమైన జిమ్ పరికరాలను ఉత్సాహవంతులైన యంగ్ క్రీడాకారులకు విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఈ గొప్ప పని ద్వారా ప్రభాస్ మనసు ఎంత గొప్పదో.. మరోసారి నిరూపించుకున్నారు. బాహుబలి ప్రయాణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న హై-ఎండ్ ట్రైనింగ్ పరికరాలన్నింటినీ ప్రభాస్ ఒక స్థానిక సంస్థకు విరాళంగా ఇచ్చారు. ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాలను పొందలేని యంగ్ అథ్లెట్లు, బాడీబిల్డర్లకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావించిన ప్రభాస్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.


ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద స్టార్‌లలో ఒకరైనప్పటికీ, ప్రభాస్ తన సేవా కార్యక్రమాలను ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంచుతారు. ఆయన వ్యక్తిత్వం, దయాగుణం గురించి బయటకు వచ్చే ఇలాంటి విషయాలు, అభిమానుల్లో ఆయనపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని మరింత పెంచుతున్నాయి. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రభాస్ రియల్ హీరో అని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను

తన తొలి సినిమా హీరో విజయ్‌ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

Updated Date - May 13 , 2026 | 06:04 PM