Prabhas - Anushka : ఎఐ సాక్షిగా మరోసారి అభిమానులు కోరిక బయటపెట్టారు!

ABN , First Publish Date - 2023-10-07T12:03:45+05:30 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స (ఏఐ) ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే టాపిక్‌. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫొటోలను ఎడిట్‌ చేయడమే జనాలకు పనిగా మారిపోయింది. తమ అభిమాన తారలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు.

Prabhas - Anushka : ఎఐ సాక్షిగా మరోసారి అభిమానులు కోరిక బయటపెట్టారు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్  (ఏఐ-AI) ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే టాపిక్‌. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫొటోలను ఎడిట్‌ చేయడమే జనాలకు పనిగా మారిపోయింది. తమ అభిమాన తారలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు ఒరిజినల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. ఇప్పటికే పవనకల్యాణ్‌, మహేష్‌, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇలా తమ అభిమాన హీరోలు అందరినీ ఎఐ టెక్నాలజీలో ఎడిట్‌ చేసి ఆనందిస్తున్నారు. అయితే ప్రభాస్‌ అభిమానులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ప్రభాస్‌కు పెళ్లి చేసి, పిల్లల్ని కూడా పుట్టించేశారు. ప్రభాస్‌కు పెళ్లి జరిగినట్లు.. ప్రభాస్‌ కుటుంబం ఇది అంటూ ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్‌ చేసి కొన్ని ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ప్రభాస్‌కు, అనుష్కకు పెళ్లి జరిగినట్లు ఓ పాపకు జన్మనిచ్చినట్లు ఫోటోలను ఎడిట్‌ చేశారు. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. (Prabhas - Anushka)

Ansuhka.jpeg

అయితే ఎప్పటినుంచో ప్రభాస్‌, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందని, వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ మధ్య అలాంటిది ఏమీ లేదని అనుష్క ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు చూసి వారిద్దరు ఒకటైతే బావుంటుందని అభిమానులు కోరుకుంటునట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Prabhas.jpeg

Updated Date - 2023-10-07T12:05:06+05:30 IST