Anna Konidela: నెటిజన్ల చిలిపి ప్రశ్నలు.. సరైన సమాధానాలు
ABN , Publish Date - May 04 , 2026 | 12:45 PM
పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచిన సంగతి తెలిసిందే! కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల (Anna Lezhneva) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచిన సంగతి తెలిసిందే! కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇన్‌స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసిన గంటలల్లోనే లక్షల్లో ఫాలో అయ్యారు. ప్రస్తుతం ఆమెను ఫాలో అవుతున్నవారి సంఖ్య 4 లక్షల 55 వేలకు పైగా. ఆదివారం ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. పవన్ కల్యాణ్ హెల్త్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారనీ, దిగులు చెందాల్సింది ఏమీ లేదని కాస్త రెస్ట్ తీసుకుంటే నయం అవుతుందని తెలిపారు.
ఓ నెటిజన్ ‘ఆంధ్రాలో మీకు ఏ ప్రాంతమంటే ఇష్టం’ అని అడగగా ప్రస్తుతం ఏసీ ఉన్న ఏ గది అయినా ఇష్టమే! ఎందుకంటే నేను నార్త్ రష్యా నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నా.. ఈ వేడికి నేను ఇంకా అలవాటు పడలేదనిపిస్తుంది’ అని చెప్పారు. ఇండియన్ కల్చర్‌కి అలవాటు పడటానికి, ఇక్కడ అడ్జస్ట్ కావడానికి ఎంత సమయం పట్టింది? అన్న ప్రశ్నకు ‘మొదటి మూడు ఏళ్లు చాలా కష్టంగా అనిపించింది. పదిహేనేళ్లయినా కొన్ని విషయాల్లో ఇంకా అడ్జస్ట్ అవుతున్నా. కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇప్పటికీ కొత్తగా, కష్టంగా ఉన్నాయి’ అని చెప్పారు.

మీరు జుట్టు ఎందుకు పెంచడం లేదు అని ఓ నెటిజన్ అడగగా ‘ఏడాది క్రితం హెయిర్ తీసేశాను. అది నాకు దేవుడికి మధ్య వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరికి సంబంధించి అయినా వెయిట్, హెయిర్, స్కిన్ కలర్ వంటి సున్నితమైన విషయాల గురించి అలా అడగొద్దు, కామెంట్స్ చేయవద్దు’ అని ఆమె కోరారు.