Anna Konidela: మూగజీవాల కోసం పుట్టినరోజున కానుక
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:23 PM
అగ్ర నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల మరోసారి తన సామాజిక సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
అగ్ర నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల మరోసారి తన సామాజిక సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లోని ఒక ఏసియాటిక్ ఏనుగు, ఒక రాయల్ బెంగాల్ పులిని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న అన్నా కొణిదెల, ఆ రెండు వన్యప్రాణుల సంరక్షణ కోసం మొత్తం రూ.6.3 లక్షలు విరాళంగా అందజేశారు. ఇందులో ఏసియాటిక్ ఏనుగు సంరక్షణకు రూ.4.3 లక్షలు, రాయల్ బెంగాల్ పులి సంరక్షణకు రూ.2 లక్షలు కేటాయించారు. ఆమె ఈ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
