సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సోల్‌‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?

ABN, Publish Date - Nov 16 , 2026 | 07:37 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొమురం పులి’ చిత్రంతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన బ్యూటీ నికీషా పటేల్. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలతో మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది.

Nikesha Patel Romantic pics

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొమురం పులి’ (Komuram Puli) చిత్రంతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన బ్యూటీ నికీషా పటేల్ (Nikesha Patel). భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నికీషా అందానికి మాత్రం కుర్రకారు బాగానే ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఓ నాలుగైదు సినిమాలతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ మరికొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ, సరైన బ్రేక్ మాత్రం ఆమె దరి చేరలేదు. తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అదృష్టం కలిసిరాకపోవడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.


ఈ మధ్యకాలంలో నికీషా పటేల్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట బాగా చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా తన రిలేషన్‌షిప్‌పై ఎలాంటి దాపరికాలు లేకుండా పబ్లిగ్గానే క్లారిటీ ఇచ్చేస్తూ తన సోల్‌మేట్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ, ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ (Statue of Liberty) నేపథ్యంలో బోటు ప్రయాణం చేస్తూ తన ప్రియుడితో కలిసి సందడి చేసింది.


ఈ ఫోటోలలో ఎంతో గ్లామర్‌గా నవ్వుతూ సెల్ఫీలకు పోజులిచ్చిన నికీషా, ఒక ఫోటోలో ఏకంగా తన సోల్‌మేట్‌కు అందరి ముందే ఘాటుగా లిప్ కిస్ ఇస్తూ కనిపించి సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేసింది. ఇద్దరూ వైట్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోతూ కెమెరాకు ఇచ్చిన ఈ రొమాంటిక్ పోజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలకు ‘‘న్యూయార్క్.. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మనం ఎప్పటికీ మర్చిపోలేని ప్రదేశాల్లో అందమైన జ్ఞాపకాలను నిర్మించుకుంటున్నాం.. మై సోల్‌మేట్’’ అంటూ క్యాప్షన్ జోడించింది. వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, ఈ రేంజ్ బోల్డ్ అండ్ రొమాంటిక్ పోస్టులతో ‘పులి’ బ్యూటీ మరోసారి నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ ఫొటోలను చూసిన వారంతా.. ఎంతకాలం.. త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ

ఘనంగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం.. తళుక్కుమన్న స్టార్స్

ఇళయదళపతి విజయ్ బయోపిక్.. హీరో, దర్శకుడు ఫిక్స్ అయినట్టేనా?

Updated Date - Nov 16 , 2026 | 07:37 PM