Keerthy Suresh: అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి..

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:32 AM

తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేశ్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2024లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్‌తో (Antony Thattil)కీర్తి సురేశ్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2024లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి పెళ్లై ఏడాది దాటింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వివాహ వేడుక గురించి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)మాట్లాడారు.

Keerty.webp

‘15 ఏళ్ళ ప్రేమ మాది. ఇరువైపులు అంగీకారం దొరుకుతుందని పెళ్లి అంత వైభవంగా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకున్నాను. కానీ, ఇంట్లో అంగీకరించడంతో అంతా ఘనంగా జరిగింది. దీనితో కాదు అనుకున్నది జరిగింది. అందుకే మా వివాహ వేడుకలో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. వేదికపై కాసేపు అయితే నా నోట మాట రాలేదు. 15 ఏళ్ల ప్రేమ 30 సెకన్లలో తాళి కట్టే సమయంలో కళ్లముందు కదిలింది. దీంతో ఆనందభాష్పాలు ఆగలేదు. ఆంటోనీది కూడా నాలాంటి పరిస్థితే. తను కూడా ఇదంత జరుగుతుందని నమ్మలేకపోయాడు. అందుకే అతడు  కూడా ఎమోషనల్‌ అయ్యాడు. మొదటిసారి ఆంటోనీ కళ్లల్లో నీళ్లు చూశాను. ఇది ఓ అందమైన ప్రయాణంస అని కీర్తి తన జర్నీని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్‌  2024లో కీర్తి సురేశ్‌, ఆంటోని తటిల్‌ వివాహం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైౖస్తవ పద్దతిలో వారి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే!

Updated Date - Jan 29 , 2026 | 11:33 AM