Keerthy Suresh: అక్క వస్తుంది.. సిద్ధంగా ఉండండి
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:07 PM
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్, ప్రతిభావంతమైన నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అక్క (Akka). యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF Entertainment) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పవర్ ఫుల్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్, ప్రతిభావంతమైన నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అక్క (Akka). యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF Entertainment) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పవర్ ఫుల్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రేక్షకులతో పాటు కీర్తి కూడా ఈ సిరీస్ పైనే ఆశలు పెట్టుకుంది. ఈమధ్యకాలంలో కీర్తి నటించిన ఏ ప్రాజెక్ట్ విజయాన్ని అందుకోలేదు. అందుకే అమ్మడు అన్ని ఆశలు అక్కా మీదనే పెట్టుకుంది. ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యి కూడా ఏడాది దాటిపోయింది. ఇక ఇన్నాళ్ళకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అక్క స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
1980ల నాటి దక్షిణ భారతదేశంలోని పెర్నూరు అనే ఒక కల్పిత నగర నేపథ్యం చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. అక్కడ స్త్రీల ఆధిపత్యమే నడుస్తుండగా, ఆ సామ్రాజ్యాన్ని శాసించే గ్యాంగ్‌స్టర్ క్వీన్స్‌గా కీర్తి సురేష్, రాధికా ఆప్టే కనిపిస్తారు. అయితే, ఊహించని విధంగా ఒక బాహ్య శత్రువు వల్ల వారి ఆధిపత్యానికి ప్రమాదం ఏర్పడటం, ఆ తర్వాత చోటుచేసుకునే హింస, పగ,మనుగడ సాగించేందుకు వారు చేసే ఘోరమైన పోరాటమే ఈ సిరీస్ సారాంశం.
ఈ సిరీస్ ద్వారా ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటివరకు గ్లామరస్, పద్ధతైన పాత్రల్లో మెప్పించిన కీర్తి సురేష్, ఈ సిరీస్‌లో మునుపెన్నడూ చూడని అత్యంత తీవ్రమైన రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో రాధికా ఆప్టేతో ఢీకొట్టనుంది. వీరితో పాటు సీనియర్ నటి తన్వి అజ్మీ, అన్షుమాన్ పుష్కర్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ది రైల్వే మెన్ వంటి హిట్ సిరీస్ తర్వాత వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూడో భారీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి అక్క కీర్తికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.