సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

ABN, Publish Date - Apr 20 , 2026 | 03:45 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులెందరో సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.

Chandrababu on Modi and Pawan

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజును (HBDNCBN) పురస్కరించుకుని, ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులెందరో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu)కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్, నందమూరి బాలకృష్ణ.. వంటి ఎందరో ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లయ్ ఇస్తున్నారు.


ప్రధాని మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవిలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)కు ఇచ్చిన రిప్లయ్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు చూపిన చొరవ నేను మరచిపోలేను. రాజధానిగా అమరావతికి గుర్తింపు తీసుకురావడంలోనూ, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామంటే అందుకు ముఖ్య కారణం మీ సహకారం, ప్రధాని నరేంద్ర మోడీ చొరవ. భగవంతుడు శక్తినిచ్చినంత కాలం నేను నా శాయశక్తులా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. మన తరం వారికే కాకుండా భావితరాల వారికి కూడా ‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని గర్వంగా చెప్పుకునే రీతిలో పురోభివృద్ధి సాధించే వరకూ నాకు విశ్రాంతి లేదు. శ్రీ వేంకటేశ్వరుడి కృప రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ప్రతిస్పందించారు.


‘‘పుట్టిన రోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆప్తులు చిరంజీవి (Mega Star Chiranjeevi)కి ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నేను నా శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నా సంకల్పంలో సహకరిస్తున్న మీలాంటి సహృదయులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్‌కు చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

Updated Date - Apr 20 , 2026 | 03:45 PM