Bandla Ganesh: ఆరిపోయే దీపం.. ఎంత మాట అన్నావ్ బండ్లన్న
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:55 PM
నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bandla Ganesh: నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బండ్లన్న పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏ చిన్న సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్నా ఆ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిధిగా వెళ్లడం, అక్కడ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడి సోషల్ మీడియాను షేక్ చేయడం అలవాటుగా మారిపోయింది. వీలైతే స్టేజిమీద లేకపోతే ఎక్స్ లో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొస్తాడు.
తాజాగా బండ్ల గణేష్ ఎక్స్ లో ఎవరి గురించో కానీ, గట్టిగా చెప్పుకొచ్చాడు. 'ఆరిపోయే దీపం ఎక్కువగా వెలుగుతుంది, మునిగే పడవ ఎక్కువగా ఊగుతుంది, చివరి దశలో ఉన్నవాళ్లకే హడావుడి ఎక్కువ ఉంటుంది' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అని నెటిజన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఇక బండ్ల గణేష్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఆరిపోయే దీపం ఎవరు.. ? చివరిదశలో ఉన్నది ఎవరు.. ? ఏ విషయంలో హడావిడి చేశారు అని ఆరాలు తీస్తున్నారు. మొన్నటికి మొన్న అల్లు అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆ తరువాత నేనేమి అనలేదు.. బాధపడితే సారీ అన్నాడు. ఆ తరువాత బన్నీవాస్.. గణేష్ కి కౌంటర్ ఇవ్వడం.. దానికి బండ్ల ఇంకో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లైన్స్ ఎవరి గురించి అన్నాడు.. అంత పెద్ద మాటలు ఎవరి గురించి అనేది తెలియాల్సి ఉంది.